
వరలక్ష్మీ శరత్‌కుమార్
హీరోయిన్‌గా, కుదిరితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, వీలైతే విలన్‌గా.. ఇలా పాత్ర ఏదైనా మనసుకు నచ్చితే చాలు వెంటనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఆల్రెడీ విజయ్, ధనుష్, ‘జయం’ రవి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారు వరలక్ష్మీ. ఇక ఆమె కథానాయికగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వెల్వెట్ నగరం’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో ఈ ఉమెన్ సెంట్రిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు. ఆ నెక్ట్స్ చిత్రబృందం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. వరలక్ష్మీ రోల్ డిఫరెంట్‌గా ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది కదూ. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు భగత్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్నారు. మేకర్ స్టూడియో ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణŠ కార్తీక్ నిర్మిస్తున్నారు.