‘సర్కార్‌’కి అంత వస్తుందా..? | Vijay Sarkar Telugu States Breakeven Mark Is 8 crores | Sakshi
Sakshi News home page

Oct 30 2018 3:43 PM | Updated on Oct 30 2018 5:09 PM

Vijay Sarkar Telugu States Breakeven Mark Is 8 crores - Sakshi

కోలీవుడ్ టాప్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా సౌత్ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సర్కార్‌. దీపావళి కానుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అడ్డంకులన్ని తొలిగిపోయాయి. దీంతో నవంబర్‌ 6 సినిమా ప్రేక్షకుల ముందుకు రావటం ఖాయం అయ్యింది. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
 

తెలుగులో విజయ్‌కి పెద్దగా మార్కెట్‌ లేదు. విజయ్‌ హీరోగా తెరకెక్కిన తుపాకి సినిమా ఒక్కటి తప్ప వేరే ఏ సినిమా కూడా ఇక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే సర్కార్‌కి ఉన్న క్రేజ్‌ దృష్ట తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ను దాదాపు 7 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా టాక్‌ వినిపిస్తోంది. అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే అంతకు మించి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి విజయ్‌ సర్కార్‌తో అయినా తెలుగు మార్కెట్‌లో సత్తా  చాటుతాడేమో చూడాలి.

ఈ సినిమా తమిళ వర్షన్‌ రైట్స్‌ 80 కోట్లకు పైగా అమ్ముడైనట్టుగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ ఇటీవల చేసిన సినిమాలన్నీ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో 80 కోట్లకు పైగా వసూళ్లు పెద్దగా కష్టమేమి కాదని భావిస్తున్నారు. విజయ్‌ సరసన కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్ మరో కీలక పాత్రలోనటించారు.

Advertisement
 
Advertisement
Advertisement