లీకైన స్టార్‌ హీరో సాంగ్ క్లిప్‌ | Vijay Sarkar Intro Song Visuals Leaked | Sakshi
Sakshi News home page

Aug 14 2018 12:24 PM | Updated on Aug 14 2018 12:29 PM

Vijay Sarkar Intro Song Visuals Leaked - Sakshi

సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను లీకులు ఇబ్బంది పెడుతున్నాయి. గీత గోవిందం సినిమా వార్తలు మరువక ముందే మరో భారీ చిత్రానికి సంబంధించిన సీన్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌, ప్రస్తుతం మురుగదాస్‌ దర్శకత్వంలో సర్కార్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ఇంట్రో సాంగ్‌కు సంబంధించిన క్లిప్‌ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా లాస్‌ వేగాస్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. భారీగా వేగాస్‌ వీదుల్లో విజయ్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. శోభి మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తున్న ఈ పాటలో విజయ్‌ స్టైలిష్‌ లుక్‌ లో అదరగొడుతున్నాడు. పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో మొబైల్‌ లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ క్లిప్‌ వైరల్‌ అయ్యింది. సన్‌ పిక్చర్స్‌ సంస్థభారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా దీపాకళికి రిలీజ్ కానుంది.

చదవండి :
సోషల్ మీడియాలో లీకైన గీత గోవిందం సీన్స్
‘గీత గోవిందం’ సినిమా లీక్‌పై విజయ్‌ స్పందన!
తెలిసి చేసినా తెలియక చేసినా నేరమే
పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement