పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్‌ | Producer Hints About Upcoming Movie Leaks | Sakshi
Sakshi News home page

Aug 14 2018 10:07 AM | Updated on Aug 14 2018 10:16 AM

Producer Hints About Upcoming Movie Leaks - Sakshi

ఆ భారీ చిత్రం ఏదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

గీత గోవిందం’ సినిమాలోని కొన్ని సీన్స్‌ సోషల్‌ మీడియాలో దర్శనమివ్వటంతో టాలీవుడ్‌లో మరోసారి పైరసీపై చర్చ మొదలైంది. గుంటూరు కేంద్రంగా గీత గోవిందం సినిమా లీకవ్వటం, వెంటనే స్పందించిన చిత్రయూనిట్, పోలీసులు... లీకేజ్‌కు కారణమైన వ్యక్తులతో పాటు పలువురు విద్యార్థులను అరెస్ట్ చేయటం తెలిసిందే.

అయితే ఈ విషయంపై గీత గోవిందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్‌ మరో షాక్‌ ఇచ్చారు. గీత గోవిందం తో పాటు మరో మూడు సినిమాలు కూడా పైరసీ బారిన పడినట్టుగా వెల్లడించారు అరవింద్. అంతేకాదు వీటిలో ఓ భారీ చిత్రం కూడా ఉందని, ఆ సినిమాల గురించి ఆలోచిస్తే బాధ అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ భారీ చిత్రం ఏదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఇప్పటికే లీకేజ్‌కి కారణమైన వ్యక్తులు పట్టుబడటంతో ఆ సినిమాలు ప్రమాదం నుంచి బయట పడినట్టే అన్న వాదన వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement