‘గీత గోవిందం’ సినిమా లీక్‌పై విజయ్‌ స్పందన! | Vijay Devarakonda Reaction On Geetha Govindam Piracy | Sakshi
Sakshi News home page

Aug 12 2018 12:45 PM | Updated on Aug 12 2018 2:20 PM

Vijay Devarakonda Reaction On Geetha Govindam Piracy - Sakshi

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ నెల 15న రిలీజ్‌కు రెడీ అవుతున్న గీత గోవిందం సినిమాకు భారీ షాక్‌ తగిలింది. సినిమా రిలీజ్‌కు ముందే కొన్ని సీన్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేయడంతో చిత్రయూనిట్‌ షాక్‌ అయ్యింది. లీకేజ్‌కు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

తాజాగా ఈ విషయంపై హీరోగా విజయ్ దేవరకొండ ఒకింత ఆవేదనతో స్పందించారు. సినిమా క్లిప్స్‌ లీకైన విషయాన్ని ప్రస్తావించకుండా ‘నేను నిరాశకు గురయ్యాను, బాధపడుతున్నాను. ఒకసారి కొపమొస్తుంది. ఇంకోసారి ఏడుపొస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు విజయ్‌. దీంతో విజయ్‌ పైరసీని ఉద్దేశించే ఈ విధంగా ట్వీట్ చేశారని భావిస్తున్నారు ఫ్యాన్స్‌.
 


చదవండి :
‘గీత గోవిందం’కు షాక్‌.. సోషల్ మీడియాలో సీన్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement