భారీ చిత్రానికి నో చెప్పాడు..! | Vijay Rejects C Sundar Sanghamitra Movie | Sakshi
Sakshi News home page

భారీ చిత్రానికి నో చెప్పాడు..!

Aug 2 2016 10:22 AM | Updated on Sep 4 2017 7:30 AM

భారీ చిత్రానికి నో చెప్పాడు..!

భారీ చిత్రానికి నో చెప్పాడు..!

ప్రస్తుతం సౌత్ సినిమా రేంజ్ కూడా భారీగా పెరిగిపోతోంది. కలెక్షన్ల రికార్డులతో పాటు బడ్జెట్ పరిదులు కూడా బాలీవుడ్ స్థాయికి వచ్చేస్తున్నాయి. ఒకటి రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీకే...

ప్రస్తుతం సౌత్ సినిమా రేంజ్ కూడా భారీగా పెరిగిపోతోంది. కలెక్షన్ల రికార్డులతో పాటు బడ్జెట్ పరిదులు కూడా బాలీవుడ్ స్థాయికి వచ్చేస్తున్నాయి. ఒకటి రెండు సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చే భారీ మొత్తాలతో రెడీ అవుతున్నాయి. రోబో, బాహుబలి, బాహుబలి 2, రోబో 2 ఇలా ఇప్పటికే వందల కోట్ల బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తున్నారు మన మేకర్స్.

ఇదే బాటలో మరో భారీ చిత్రం రెడీ అవుతోంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన సుందర్ సి దర్శకత్వంలో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా సంఘమిత్ర పేరుతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇంత భారీగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటించేందుకు విజయ్ని సంప్రదించగా అతను, నో అన్నాడట.

భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెండేళ్ల పాటు డేట్స్ కేటాయించాల్సి ఉండటం, ఆ సమయంలో మరే సినిమా చేసే ఛాన్స్ లేకపోవటంతో విజయ్, ఈ ప్రాజెక్ట్  నుంచి తప్పుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వరుసగా వందకోట్ల సినిమాలతో తమిళనాట సత్తా చాటిన విజయ్, హీరోగా నటిస్తే కలెక్షన్ల విషయంలో ప్లస్ అవుతుందని భావించిన నిర్మాతలకు, విజయ్ నిర్ణయం షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement