విజయ్‌ను ఎందుకు కలిశానంటే.. | vijay meets to sahesha segal | Sakshi
Sakshi News home page

విజయ్‌ను ఎందుకు కలిశానంటే..

Aug 24 2017 12:46 AM | Updated on Sep 17 2017 5:53 PM

విజయ్‌ను ఎందుకు కలిశానంటే..

విజయ్‌ను ఎందుకు కలిశానంటే..

హీరోయిన్‌గా కోటీ ఆశలతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌.

తమిళసినిమా:  హీరోయిన్‌గా కోటీ ఆశలతో టాలీవుడ్‌కు దిగుమతి అయిన బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌. ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్‌కుమార్‌ మనవరాలైన ఈమె నటించిన తొలి తెలుగు చిత్రం అఖిల్‌. ఈ చిత్రం సాయేషాకు నిరాశనే మిగిల్సింది. అయితే అఖిల్‌ చిత్రంతో ఈ బ్యూటీకి ఏమైనా మేలు జరిగిందంటే అది కోలీవుడ్‌కు ఎంట్రీ అవడమే. నవ నటీమణులను పరిచయం చేయడంలో ముందుండే దర్శకుడు విజయ్‌ దృష్టిలో సాయేషాసైగల్‌ పడింది.

అంతే జయంరవికి జంటగా తాను దర్శకత్వం వహించిన వనమగన్‌ చిత్రంలో నాయకిగా అవకాశం ఇచ్చేశారు. ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందినా, సాయేషాకు మాత్రం మంచి పేరే తెచ్చి పెట్టింది. వనమగన్‌ చిత్రంలో సాయేషా నటించిన ఒక పాటకు నృత్య దర్శకత్వం వహించిన డాన్సింగ్‌ కింగ్‌ ప్రభుదేవాకు ఆమె డాన్స్‌ బాగా నచ్చేసింది. అంతే తాను విశాల్, కార్తీ హీరోలుగా తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌ చిత్రం కరుప్పురాజా వెళ్లరాజా చిత్రంలో హీరోయిన్‌ చాన్స్‌ ఇచ్చేశారు.

దీంతో తన కెరీర్‌ వెలిగి పోతుందని సంతోషంతో తబ్బిబ్బు అయిపోయిన సాయేషా ఆనందం అంతలోనే ఆవిరై పోయింది. కారణం కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రం డ్రాప్‌ అయ్యిపోయ్యిందనే ప్రచారం జరగడమే. అయితే ఇటీవల అనూహ్యంగా చెన్నైకి వచ్చిన సాయేషాసైగల్‌ కరుప్పురాజా వెళ్‌లైరాజా చిత్రంలో నటించే అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డానని, ఈ చిత్రానికి సంబంధించి నాలుగు రోజులు షూటింగ్‌ కూడా జరిగిందని చెప్పింది.

అయితే చిత్రం డ్రాప్‌ అయిన విషయం తనకు తెలియదని, దర్శకుడు ప్రభుదేవా కూడా తనకు ఏమీ చెప్పలేదని పేర్కొంది. కాగా తాను చెన్నైకి రావడానికి కారణం ఏమిటని అడుగుతున్నారని తనకు కోలీవుడ్‌లో తొలి అవకాశం కల్పించడంతో పాటు, వనమగన్‌ చిత్ర షూటింగ్‌లో దర్శకుడు విజయ్‌ తనను ఒక సోదరిగా చాలా బాగా చూసుకున్నారని, అందుకే ఆయన్ని కలిసి రాఖీ పండగను పునస్కరించుకుని రాఖీ కట్టడానికి ముంబయి నుంచి ప్రత్యేకంగా చెన్నైకి వచ్చానని చెప్పింది. ఏదేమైనా సాయేషా సైగల్‌కిప్పుడు ఏ భాషలోనూ చిత్రం లేదన్నది వాస్తవం.

Advertisement
 
Advertisement
Advertisement