‘మీ బరువు, బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్’ | Vijay Deverakonda Geetha Govindam First Look Out | Sakshi
Sakshi News home page

Jun 23 2018 3:41 PM | Updated on Aug 3 2019 12:30 PM

Vijay Deverakonda Geetha Govindam First Look Out - Sakshi

‘నా కాళ్లు తిమ్మిరెక్కినా.. నడుము నొప్పి లేచినా.. మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్‌..’ అంటున్నాడు యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ఈ మాటలు విజయ్‌ ఎందుకు అన్నాడో..? ఈరోజు విడుదలైన గీత గోవిందం ఫస్ట్‌ లుక్‌ చూస్తే అర్థమవుతుంది. విజయ్‌ గోడకు కాళ్లు పెట్టుకుని కూర్చుంటే, కాళ్ల పై రష్మిక ఎంచక్కా కూర్చొని నవ్వుతూ ఉంది. దీని గురించే విజయ్‌ మాట్లాడుతూ పై విధంగా కామెంట్‌ చేశాడు. 

గీతా ఆర్ట్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో గీత పాత్రలో ఛలో ఫేం రష్మిక మందన నటించగా, గోవిందం పాత్రలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్నాడు. సోలో ఫేం పరుశురామ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా గోపి సుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్‌లో విజయ్‌ ‘టాక్సీవాలా’  సినిమాను చేస్తున్నాడు. గ్రాఫిక్స్‌ పనుల కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే ‘టాక్సీవాలా’గా విజయ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement