తమ్ముడి కోసం విజయ్‌ దేవరకొండ! | Vijay Deverakonda Chief Guest for Anand Deverakonda Dorasani | Sakshi
Sakshi News home page

తమ్ముడి కోసం విజయ్‌ దేవరకొండ!

Jul 7 2019 11:43 AM | Updated on Jul 7 2019 3:56 PM

Vijay Deverakonda Chief Guest for Anand Deverakonda Dorasani - Sakshi

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తన తమ్ముడిని హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న దొరసాని సినిమాతో ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన సినిమా టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్‌ రావటంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పాడ్డాయి.

ఇప్పటి వరకు విజయ్‌ దేవరకొండ మాత్రం తమ్ముడు నటిస్తున్న సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీజర్‌, ట్రైలర్‌లపై కూడా స్పందించలేదు. అయితే ఆదివారం జరగబోయే ప్రీ రిలీజ్‌ వేడుకలో ఒకేసారి తన అనుభూతులన్నింటిని పంచుకునేందుకే ఇప్పటి వరకు విజయ్‌ స్పందించలేదని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న విజయ్‌, ఏం మాట్లాడతాడా అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆనంద్‌ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న దొరసాని సినిమాతో రాజశేఖర్‌ జీవితల చిన్నకూతురు శివాత్మిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వంలో పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మధుర శ్రీధర్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement