వైరల్‌ అవుతున్న ‘టాక్సీవాలా’ ట్రైలర్‌!

Vijay Devarakonda Taxiwaala Trailer Goes Viral - Sakshi

ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు విజయ్‌ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం విడుదల కాబోతోంది. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

హారర్‌, కామెడీ, యూత్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింన ఈ సినిమా ట్రైలర్‌లో విజయ్‌ మళ్లీ తన నటనతో ఆకట్టుకున్నాడు. కథ మొత్తం టాక్సీ చుట్టే తిరుగుతుందని ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. ఆ టాక్సీతో విజయ్‌ జీవితంలో వచ్చిన యూ టర్న్స్‌ని థియేటర్స్‌లో చూడాల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియాంక లుక్స్‌తో అదరగొట్టేసింది. జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఎస్‌కె‌ఎన్ నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top