విజయ్‌ దేవరకొండ ‘బ్రేకప్‌’!

Vijay Devarakonda Next Movie Title Break Up - Sakshi

వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న సెన్సేషనల్‌ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డియర్‌ కామ్రేడ్‌ షూటింగ్ పూర్తిచేసిన విజయ్‌, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై డైరెక్షన్‌లో హీరో చిత్రాన్ని ప్రారంభించాడు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న కాంత్రి మాధవ్‌ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ వార్త ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ అనేకసార్లు ప్రేమ విఫలమైన బాధితుడిగా కనిపించనున్నాడట. అం‍దుకే డిఫరెంట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘బ్రేకప్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top