అప్పుడు ఫైటింగ్‌... ఇప్పుడు టాకింగ్‌!

Vijay Devarakonda and Mahesh Babu hang out on Maharshi set - Sakshi

రిషి జర్నీ గురించి తెలుసుకోవడానికి విజయ్‌ దేవరకొండ ‘మహర్షి’ సెట్స్‌కి వెళ్లారు. మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మిస్తున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. రిషి పాత్రలో మహేశ్, రవి పాత్రలో నరేశ్‌ కనిపిస్తారు. ఈ సినిమా సెట్స్‌కు వెళ్లారు హీరో విజయ్‌ దేవరకొండ. ‘‘నైస్‌ టైమ్‌.. విజయ్‌ నీ హాలీడేని బాగా ఎంజాయ్‌ చెయ్‌’’ అన్నారు మహేశ్‌. ‘‘మహేశ్‌ సార్, వంశీ అన్నను కలవడం సంతోషంగా ఉంది.

ఒకప్పుడు మహేశ్‌ అన్న మూవీ టిక్కెట్స్‌ కోసం కౌంటర్‌ దగ్గర ఫైట్‌ చేసేవాడ్ని. ఇప్పుడు ఆయనతో కలిసి వర్క్‌ గురించి మాట్లాడే అవకాశం వచ్చింది’’ అని ఆనందం వ్యక్తం చేశారు విజయ్‌ దేవరకొండ. అన్నట్లు.. హాలీడే ఎంజాయ్‌ చెయ్‌ అని మహేశ్‌ ఎందుకు అన్నట్లు అనే విషయానికొస్తే.. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హాలిడే మూడ్‌లో ఉన్నారు. జెర్మనీ వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. ‘మహర్షి’ సినిమా కెమెరామెన్‌ కేయూ మోహనన్‌ బర్త్‌ డే వేడుకలు సెట్స్‌లో జరిగాయి. చిత్రబృందం సమక్షంలో మోహనన్‌ కేక్‌ కట్‌ చేశారు.  ‘మహర్షి’ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top