
గతంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన ఫిట్‌నెస్ చాలెంజ్ తరహాలో ప్రస్తుతం గ్రీన్ చాలెంజ్ ట్రెండ్ అవుతోంది. పలువురు సినీ రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు తమ సన్నిహితులకు గ్రీన్ చాలెంజ్‌ను విసురుతున్నారు. పచ్చదనాన్ని కాపాడేందుకు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు మొక్కలు నాటుతూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా ఈ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ కూడా చేరిపోయాడు. తనకు కిడాంబి శ్రీకాంత్, బొంతు రామ్మోహన్‌లు విసిరిన హరితహారం సవాల్‌ను స్వీకరించిన విజయ్, కాకినాడ యువకులతో కలిసి మొక్కలు నాటారు. తరువాత వారితో కలిసి భోజనం చేస్తూ సరదాగా గడిపారు. ఇటీవల గీత గోవిందం సినిమాతో ఘనవిజయం సాధించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాక్సీవాలా, నోటా సినిమాల పనుల్లో బిజీగా ఉన్నారు.
#HarithaHaram #GreenChallenge accepted :) Planting trees and lunching with my Kakinada Boys :))
— Vijay Deverakonda (@TheDeverakonda) 31 August 2018
I now challenge my rowdies @Sheetal_Chowhan @samhitha17 @ChaltanyaReddy @akshitha9198 @karanam_pooja @xziamstheticx @keerthanaGMalar pic.twitter.com/gB4iyjBvtD