కాబోయే తల్లికి శుభాకాంక్షలు!

Vignesh Shivan Calls Nayanthara Mother of My Future Children - Sakshi

తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్, నయనతార కొంతకాలంగా  ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఈ ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ల ద్వారా, కలసి చేసే ప్రయాణాల ద్వారా ఎప్పటికప్పుడు తమ ప్రేమను చెప్పకనే చెబుతున్నారు. ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్‌ లో విఘ్నేష్‌ శివన్‌ని నయనతార హబ్బీ (భర్త) అని సంబోధించారు.

తాజాగా మదర్స్‌ డే సందర్భంగా విఘ్నేష్‌ ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. నయనతార చిన్న పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో అది. దానికి ఈ విధంగా క్యాప్షన్‌ చేశారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలకు తల్లి కాబోయే  తనకి (నయనతారని ఉద్దేశిస్తూ) మదర్స్‌ డే శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు విఘ్నేష్‌. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు ఈ కామెంట్‌ మరింత బలాన్ని చేకూర్చింది.


విఘ్నేష్‌ శివన్, నయనతార
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top