పర్‌ఫెక్ట్‌ స్టెప్పులతో ఇరగదీసిన జాన్వీ

Video Viral: Jahnvi Kapoor Dance On Bollywood Song - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్ని అందిపుచ్చుకున్నారు. తను నటించిన మొదటి సినిమాకే(ధడక్‌) జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం జాన్వీ నటిస్తున్న చిత్రం ‘తఖ్త్‌’. బాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాతగా పేరుపొందిన కరణ్‌ జోహర్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌, కరీనా కపూర్‌, అనిల్‌ కపూర్‌, భూమి పడ్నేకర్‌, జాన్వీ కపూర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2021 డిసెంబర్‌లో క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో  తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

తాజాగా ఈ మూవీలోని ఓ సన్నివేశం కోసం డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న జాన్వీ .. ఆ డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. పాత హిందీ పాటకు కొరియోగ్రాఫర్‌తో కలిసి స్టెప్పులు వేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తన హావాభావాలు.. సూపర్‌ స్టెప్పులతో.. ఎక్కడా కొంచెం కూడా తడబడకుండా వహ్వా అనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో జాన్వీ డ్యాన్స్‌ను చూసిన నెటిజన్లు ఆమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. తల్లికి తగ్గ తనయురాలు.. పర్‌ఫెక్ట్‌ స్టెప్పులతో ఇరగదీసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top