వెంకటేష్ 'బాబు బంగారం' | victory venkatesh next movie title babu bangaram | Sakshi
Sakshi News home page

వెంకటేష్ 'బాబు బంగారం'

Dec 8 2015 9:57 AM | Updated on Sep 3 2017 1:42 PM

వెంకటేష్ 'బాబు బంగారం'

వెంకటేష్ 'బాబు బంగారం'

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పడిప్పుడే తిరిగి సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. కుర్ర హీరోల పోటి పెరిగిపోవటంతో ఎలాంటి కథను ఎంచుకోవాలనే...

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పడిప్పుడే తిరిగి సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. కుర్ర హీరోల పోటీ పెరిగిపోవటంతో ఎలాంటి కథను ఎంచుకోవాలనే ఆలోచనలతో చాలా టైం తీసుకున్న వెంకీ, తాజాగా భలే బలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాలో వెంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు 'బాబు బంగారం' అనే టైటిల్ను ఫైనల్ చేశారట. లక్ష్మీ, తులసీ లాంటి హిట్ సినిమాల తరువాత మరోసారి నయనతార వెంకటేష్తో జోడి కడుతోంది. ప్రజెంట్ భారీ సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న నయనతార హీరోయిన్గా నటిస్తుండటం ఈ సినిమాకు కూడా చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించి 2016 జూన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement