షారుక్‌ పోయె..  విక్కీ వచ్చె... | Vicky Kaushal Replaces Shah Rukh Khan in Rakesh Sharma Biopic | Sakshi
Sakshi News home page

షారుక్‌ పోయె..  విక్కీ వచ్చె...

Feb 24 2019 1:32 AM | Updated on Apr 3 2019 6:34 PM

Vicky Kaushal Replaces Shah Rukh Khan in Rakesh Sharma Biopic - Sakshi

నిన్న మొన్నటివరకు బాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సత్తా చాటిన విక్కీ కౌశల్‌ ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌’ చిత్రంతో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేశారు. ఆయన తొలిసారి ఫుల్‌ లెంగ్త్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర కనకవర్షం కురిపించింది. విక్కీ ఇప్పుడు భారత వ్యోమగామి రాకేశ్‌ శర్మ బయోపిక్‌ ‘సారే జహాసే అచ్చా’లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.

నిజానికి ఈ బయోపిక్‌లో తొలుత ఆమిర్‌ఖాన్‌ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సడన్‌గా షారుక్‌ ఖాన్‌ పేరు తెరపైకి వచ్చింది. అయితే... ‘డాన్‌ 3’ సినిమా కోసం షారుక్‌ఖాన్‌ రెడీ అవుతున్నారని, అందుకే ఆయన స్థానంలో విక్కీ కౌశల్‌ నటించబోతున్నారని బాలీవుడ్‌ తాజా ఖబర్‌.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement