‘‘ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న గుమ్మడి నర్సయ్యను ప్రజాప్రతినిధులు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ‘గుమ్మడి నర్సయ్య’ సినిమా తీస్తుండటం అభినందనీయం. ఈ సినిమాతో అయినా సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో వెండితెరకు రానుంది.
ఆయన పాత్రలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కనిపించనున్నారు. పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో నల్లా సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రధాని మోదీగారు కూడా ఈ సినిమా చూసేలా ప్రయత్నిస్తాను. అన్ని భాషల్లో ఈ చిత్రం తీయాలి’’ అని సూచించారు. ‘‘రాజకీయం అంటే ఉద్యోగమో, వ్యాపారమో కాదు... ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తు చేయడం కోసం ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు పరమేశ్వర్ హివ్రాలే. ‘‘మా సినిమా రిలీజ్ తర్వాత రాజకీయాల్లో మార్పు వస్తుందని భావిస్తున్నాను’’ అని నల్లా సురేష్ రెడ్డి తెలిపారు.
‘‘గుమ్మడి నర్సయ్యగారిలాంటి మంచి మనిషి పాత్రలో నటిస్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది’’ అని శివరాజ్ కుమార్ చెప్పారు. ‘‘నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు గుమ్మడి నర్సయ్య. ఈ సినిమా ప్రారంభోత్సవంలో కొత్తగూడెం, పిన΄ాక ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, ΄ాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తదితరులు ΄ాల్గొన్నారు.


