థ్రిల్లర్‌ నేపథ్యంలో... | vg entertainment movie launch in hyderabad | Sakshi
Sakshi News home page

థ్రిల్లర్‌ నేపథ్యంలో...

May 17 2019 12:08 AM | Updated on May 17 2019 12:08 AM

vg entertainment movie launch in hyderabad - Sakshi

షెర్రీ అగర్వాల్‌, విహారి

విహారి, షెర్రీ అగర్వాల్‌ని హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు చిత్రపరిశ్రమలో కొరియోగ్రాఫర్, దర్శకత్వ శాఖలో పని చేసిన వీర గనమాల స్వీయ దర్శకత్వంలో వీజీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వీర గనమాల మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. గురువారం నుంచే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు. తనికెళ్ల భరణి, అజయ్, రాజీవ్‌ కనకాల, చమ్మక్‌ చంద్ర, తోటపల్లి మధు తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement