మూవీ తెలియదు. లొకేషన్ అసలే తెలియదు.
సాక్షి, ప్రత్యేకం: మూవీ తెలియదు. లొకేషన్ అసలే తెలియదు. కానీ, నటుడు వెన్నెల కిశోర్ మాత్రం మట్టి తొక్కుతున్నారు. అదీ ఎర్ర మట్టి. అంటే కుండలు తయారు చేయడానికే. డౌన్ టూ ఎర్త్ క్యారెక్టర్ అని చెప్పిన దర్శకుడు తనతో మట్టి తొక్కించారని వెన్నెల కిశోర్ ట్విటర్‌లో ఓ ఫొటో షేర్ చేశారు.
ఫోటోను గమనిస్తే.. చుట్టూ పచ్చని వాతావరణం.. పక్కనే మట్టి కుండలూ కనిపిస్తున్నాయి. మట్టి తొక్కుతున్న వెన్నెల కిశోర్ ఫొటోను చూసిన నెటిజన్లు.. 'మట్టిలో మాణిక్యం-వెన్నెల కిశోరం' అంటూ కామెంట్లు చేశారు. వెన్నెల కిశోర్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.
Down to earth role annaru director and .... pic.twitter.com/9qgkNR8cYc
— vennela kishore (@vennelakishore) 29 August 2017