వెంకీ, రామ్‌ల మసాలా? | Venky-Ram's film titled Masala! | Sakshi
Sakshi News home page

వెంకీ, రామ్‌ల మసాలా?

Aug 7 2013 11:55 PM | Updated on Sep 1 2017 9:42 PM

వెంకీ, రామ్‌ల మసాలా?

వెంకీ, రామ్‌ల మసాలా?

వెంకటేష్, రామ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కు ఇది రీమేక్.

వెంకటేష్, రామ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హిందీలో ఘనవిజయం సాధించిన ‘బోల్ బచ్చన్’కు ఇది రీమేక్. విజయభాస్కర్ దర్శకుడు. డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, షాజన్ పదమ్‌సి కథానాయికలు. 
 
 ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంతవరకూ అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. అయితే ఇప్పటికే  ‘గోల్‌మాల్’, ‘గరం మసాలా’, ‘రామ్-బలరామ్’, ‘సర్వేజనా సుఖినోభవంతు’, ‘బ్లాక్‌బస్టర్’ తదితర టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. 
 
 అయితే దర్శక నిర్మాతలు ఇంకా ఏదీ ధ్రువీకరించలేదు. అయితే... ఫైనల్‌గా ‘మసాలా’ టైటిల్ ఓకే అయ్యే అవకాశం ఉందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం ఇటీవలే థాయ్‌లాండ్‌లో ఓ పాట చిత్రీకరించారు. బ్యాలెన్స్ ఒక్క పాటను ఈ నెల మూడోవారంలో హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. ఈ నెల 17న పాటలను విడుదల చేసే యోచనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement