టీజర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది : వెంకటేష్‌

Venkatesh Unveiling The Official Teaser of Mismatch - Sakshi

ఆటగదరా ఫేం ఉదయ్ శంకర్‌, ఐశ్వర్య రాజేష్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్‌ మ్యాచ్‌’. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. విజయ్ ఆంటోని హీరోగా సలీం సినిమాను రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.

ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ... ‘మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చిత్ర యూనిట్‌కు గుడ్ లక్. మిస్ మ్యాచ్  ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజ గారికి డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నా’ అన్నారు.

డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ మాట్లాడుతూ... ‘విక్టరీ వెంకటేష్ గారు మా చిత్ర టీజర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నా’ అన్నారు. హీరో ఉదయ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ‘నా మొదటి సినిమా ఆటకథరా శివ సినిమాకు వెంకటేష్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా టీజర్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. భూపతిరాజా గారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించార’న్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top