రిలీజ్కు రెడీ అవుతున్న బాబు బంగారం | Venkatesh Babu Bangaram ready to release | Sakshi
Sakshi News home page

రిలీజ్కు రెడీ అవుతున్న బాబు బంగారం

Jun 22 2016 12:42 PM | Updated on Sep 4 2017 3:08 AM

రిలీజ్కు రెడీ అవుతున్న బాబు బంగారం

రిలీజ్కు రెడీ అవుతున్న బాబు బంగారం

సక్సెస్ ఫుల్ పెయిర్ వెంకటేష్, నయనతారలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. భలే భలే మొగాడివోయ్తో తానేంటో ప్రూవ్ చేసుకున్న మారుతి, ఈ సినిమాతో...

సక్సెస్ ఫుల్ జంట వెంకటేష్, నయనతార హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. ఇంతకుముందు భలే భలే మొగాడివోయ్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్న మారుతి, ఈ సినిమాతో తొలిసారిగా ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఒక్క పాట మినహా ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు సినిమా మీద అంచనాలను పెంచేస్తుండగా.. తాజాగా ఆడియో రిలీజ్ డేట్ను ప్రకటించారు. జులై 9న ఈ సినిమా ఆడియోను అభిమానుల సమక్షంలో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే బాబు బంగారం సినిమా రిలీజ్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుండటంతో బాబు బంగారం రిలీజ్ డేట్ ను కూడా పెండింగ్ లో పెట్టారు. కబాలితో పోటీ లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బాబు బంగారం యూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement