సస్పెన్స్‌.. థ్రిల్‌... | Venkatapuram movie updates | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌.. థ్రిల్‌...

Apr 26 2017 11:52 PM | Updated on Sep 5 2017 9:46 AM

సస్పెన్స్‌.. థ్రిల్‌...

సస్పెన్స్‌.. థ్రిల్‌...

‘‘వెంకటాపురం’ పాటలు బాగున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్‌ అయ్యి వంద రోజులు ఆడాలి.

‘‘వెంకటాపురం’ పాటలు బాగున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్‌ అయ్యి వంద రోజులు ఆడాలి. తెలంగాణ కళాకారులు సినిమా ఇండస్ట్రీలో ముందుకు వచ్చి తెలంగాణ వాడీ వేడీ  చూపించాలి. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఉండే ఆంధ్రావాళ్లంతా తెలంగాణావాదులే. మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, కలిసి మెలిసి ఉండాలి’’ అని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.

‘హ్యాపీడేస్‌’ ఫేమ్‌ రాహుల్, మహిమా మక్వాన్‌ జంటగా వేణు దర్శకత్వంలో గుడ్‌ సినిమా గ్రూప్‌ పతాకంపై శ్రేయాస్‌ శ్రీనివాస్, తుము ఫణికుమార్‌ నిర్మించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘వెంకటాపురం’. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా బిగ్‌ సీడీని నాయిని, పాటల సీడీని దర్శకుడు మారుతి విడుదల చేశారు.

హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ– ‘‘రాహుల్‌ నాకు మంచి మిత్రుడు. ఈ చిత్రకథ నాకు తెలుసు. చాలా బాగుంటుంది. అచ్చు పాటలు, రీ–రికార్డింగ్‌ బాగుంటాయి. తనతో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తా’’ అన్నారు. ఇందులో మంచి పాత్ర చేశానని రాహుల్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement