
వేలైక్కారన్ విశేషాలు
రెమో వంటి సంచలన చిత్రం తరువాత నేటి క్రేజీ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం వేలైక్కారన్.
తమిళసినిమా: రెమో వంటి సంచలన చిత్రం తరువాత నేటి క్రేజీ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం వేలైక్కారన్. దీంతో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. గతంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ఈ టైటిల్‌తో వస్తున్న శివకార్తికేయన్‌కు జంటగా అగ్రనాయకి నయనతార నటించడం మరో విశేషం. ఇక తనీఒరువన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం వేలైక్కారన్.
రెమో వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన 24ఏఎం.స్టూ డియోస్ అధినేత ఆర్‌డీ.రాజా నిర్మిస్తున్న తాజా చిత్రం వేలైక్కారన్. ఈ చిత్రం ద్వారా మలయాళ నటుడు షాహిద్ ఫాజిల్ కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.
త్వరలో ఆడియో ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అంతకంటే ముందు నటుడు ఫాహిద్ ఫాజిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 8వ తేదీన చిత్ర రెండో పోస్టర్‌ను విడుదల చేయనున్నారు. అదే విధంగా చిత్ర టీజర్‌ను పంద్రాగస్ట్ సందర్భంగా ఈ నెల 14న రీలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కాగా చిత్రాన్ని సెప్టెంబరు నెలలో విడుదల చేయనున్నట్లు నిర్మాత ఆర్‌డీ.రాజా ఇప్పటికే వెల్లడించారు.