నా సపోర్ట్‌ ఆ అమ్మాయికే... | Veerabhadra Creations New Movie Launch | Sakshi
Sakshi News home page

నా సపోర్ట్‌ ఆ అమ్మాయికే...

Nov 9 2017 12:26 AM | Updated on Nov 9 2017 12:26 AM

Veerabhadra Creations New Movie Launch - Sakshi

నూతన నటుడు శ్రీకాంత్, హేమలత (బుజ్జి) హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందుతోంది. భానుచందర్, సుమన్, సన, కాశీ విశ్వనాధ్‌ ముఖ్యపాత్రల్లో కె. గోవర్ధన్‌రావు దర్శకత్వంలో వీరభద్ర క్రియేషన్స్‌ పతాకంపై హేమలతారెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతలు మల్కాపురం శివకుమార్, హేమలత కెమెరా స్విచాన్‌ చేశారు. నిర్మాత ‘మల్టీ డైమన్షన్‌’ వాసు క్లాప్‌ ఇవ్వగా, మరో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్‌ అందించారు.

అయోధ్య కుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హేమలతారెడ్డి మాట్లాడుతూ– ‘‘మేం నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే ఓ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 20న కొత్త సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో అతిథిగా కాకుండా, ఫుల్‌లెంగ్త్‌ రోల్‌ చేస్తున్నా. హేమలతకి సినిమా పట్ల చక్కని అభిరుచి ఉంది. ఆ అమ్మాయికి సపోర్ట్‌ చేస్తా’’ అన్నారు భానుచందర్‌. ‘‘ఆంధ్ర, తెలంగాణలలో 50–60 రోజులు షూటింగ్‌ చేస్తాం’’ అన్నారు గోవర్ధన్‌రావు. ఈ చిత్రానికి సంగీతం: రమణ్‌ రాథోడ్, కెమెరా: ప్రసాద్‌ ఈదర (శంకర్‌ కుమార్‌).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement