సరదాగా ట్రై చేశా! | varuntej kooking | Sakshi
Sakshi News home page

సరదాగా ట్రై చేశా!

Nov 10 2017 12:37 AM | Updated on Nov 10 2017 12:37 AM

varuntej kooking - Sakshi

... ఓసారి టేస్ట్‌ చేస్తారా? అని హీరో వరుణ్‌తేజ్‌ ప్రేమగా అడిగినట్లు ఉంది ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో చూస్తుంటే. జస్ట్‌ కాస్త టైమ్‌ దొరికితే చాలు గరిటె పట్టుకుని తమలో ఉన్న వంట టాలెంట్‌ను చూపించడానికి రెడీ అయిపోతున్నారు టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు. నాగచైతన్య అప్పడప్పుడూ వెరైటీస్‌ వండే విషయాన్ని సమంత ఫొటోలు తీసి మరీ, బయటపెడుతుంటారు. నారా రోహిత్‌ అయితే తన ప్రతి సినిమా షూటింగ్‌లో ఏదో ఒక రోజున స్వయంగా బిర్యానీ, చేపల పులుసు వంటివి చేస్తుంటారు. ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ కూడా గరిటె తిప్పడం తనకూ వచ్చంటున్నారు.

‘‘సరదాగా ట్రై చేశా’’ అంటూ తాను కుక్‌ చేసిన ఐటమ్స్‌ని ప్లేట్‌లో పెట్టి, చిరునవ్వులు చిందిస్తూ ఫొటో దిగారు.  వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. బహుశా షూటింగ్‌కి కాస్త టైమ్‌ దొరికినప్పుడు వంటగదితో వరుణ్‌ ట్రై చేశారేమో. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. నానీతో ‘నిన్ను కోరి’లాంటి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ తీసిన శివ నిర్వాణ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నెక్ట్స్‌ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

Advertisement
 
Advertisement
Advertisement