డబ్బింగ్‌ షురూ | Varun's Antariksham 9000 KMPH to release on Dec 21 | Sakshi
Sakshi News home page

డబ్బింగ్‌ షురూ

Nov 18 2018 3:55 AM | Updated on Nov 18 2018 3:55 AM

Varun's Antariksham 9000 KMPH to release on Dec 21 - Sakshi

వరుణ్‌ తేజ్‌

జనరల్‌గా ఆస్ట్రోనాట్‌ అంటే రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌లో బిజీ బిజీగా ఉంటారు. కానీ టాలీవుడ్‌ ఆస్ట్రోనాట్‌ వరుణ్‌ తేజ్‌ చెన్నై, హైదరాబాద్‌లోని స్కూల్స్‌కి వెళ్లొచ్చారు మరి.. స్టూడెంట్స్‌కు రాకెట్‌ గురించి ఏమైనా పాఠాలు చెప్పారా? లేక చిన్ననాటి జ్ఞాపకాలను వెతుక్కుంటూ వెళ్లారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్‌. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్‌’.

లావాణ్యా త్రిపాఠి, అదితీరావ్‌ హైదరీ కథానాయికలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్నారు వరుణ్‌ తేజ్‌. ‘‘ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభించింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. సత్యదేవ్, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు ప్రశాంత్‌ విహారి స్వరకర్త. క్రిష్‌ సమర్పణలో సాయిబాబు, రాజీవ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement