ప్రేమికుల రోజుకి ముందే తొలి ప్రేమ | Varun Tej's Tholiprema Title Poster Released | Sakshi
Sakshi News home page

ప్రేమికుల రోజుకి ముందే తొలి ప్రేమ

Dec 5 2017 1:21 AM | Updated on Dec 5 2017 1:21 AM

Varun Tej's Tholiprema Title Poster Released  - Sakshi

ఫస్ట్‌ పెన్, ఫస్ట్‌ టూర్, ఫస్ట్‌ ఫ్రెండ్, ఫస్ట్‌ లవ్, ఫస్ట్‌ జాబ్‌.. ఇలా ఫస్ట్‌ని జస్ట్‌ అలా మరచిపోలేం. జీవితాంతం గుర్తుండే అనుభూతులు అవి. వీటిలో పొరపాటున దేన్నైనా మరచిపోయినా ఫస్ట్‌ లవ్‌ని మాత్రం అంత సులువుగా మరచిపోలేం. వచ్చే వేలంటైన్స్‌ డేకి ఐదు రోజుల ముందు వరుణ్‌ తేజ్‌ ఫస్ట్‌ లవ్‌ని చూడబోతున్నాం. ‘ఫిదా’ వంటి మంచి లవ్‌స్టోరీ తర్వాత వరుణ్‌ చేస్తోన్న మరో లవ్‌స్టోరీ ‘తొలి ప్రేమ’.

వరుణ్‌ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ పోస్టర్‌ను సోమవారం చిత్రబృందం అధికారికంగా రిలీజ్‌ చేసింది. ‘‘హార్ట్‌ టచింగ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఇది. వరుణ్‌ తేజ్‌ను కొత్త క్యారక్టరైజేషన్‌లో చూస్తారు. డిసెంబర్‌లో షూటింగ్‌ను కంప్లీట్‌ చేసి ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

Advertisement
 
Advertisement
Advertisement