వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో! | Varun Tej Valmiki Movie Trailer Released | Sakshi
Sakshi News home page

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

Sep 9 2019 5:02 PM | Updated on Sep 9 2019 5:09 PM

Varun Tej Valmiki Movie Trailer Released - Sakshi

ఓ రీమేక్‌ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఏవిధంగా అందించాలో హరీష్‌శంకర్‌కు తెలిసనట్టు మరే దర్శకుడికి తెలీదేమో. అందుకే హిందీలో దబాంగ్‌ అంటే తెలుగులో గబ్బర్‌సింగ్‌ అంటూ రికార్డులన్నీ బ్రేక్‌ చేసేశాడు. మరోసారి అలాంటి ఓ రీమేక్‌తో మన ముందుకు వస్తున్నాడు ఆ దర్శకుడు. తమిళ్‌ హిట్‌ మూవీ జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తున్నాడు. వరుణ్‌ తేజ్‌ డిఫరెంట్‌ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ టీజర్‌, పోస్టర్స్‌, సాంగ్స్‌తో మంచి బజ్‌ను నెలకొల్పాయి. వరుణ్‌ తేజ్‌ తన లుక్‌తో ఆశ్చర్యపరుస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను  తాజాగా విడుదల చేశారు.

ఈ ట్రైలర్‌లో వరుణ్‌ తేజ్‌ చెప్పిన డైలాగ్స్‌ హైలెట్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. గద్దలకొండ గణేష్‌ పాత్రలో వరుణ్‌ జీవించినట్లు కనిపిస్తోంది. ‘నాపైన పందాలు ఏస్తే గెలుస్తరు.. నాతోటి పందాలు వేస్తే సస్తరు..’, ‘గవాస్కర్ సిక్సు కొట్టుడు.. బప్పిలహరి పాట కొట్టుడూ.. నేను బొక్కలు ఇరగొట్టడం సేం టు సేం...’,అనే డైలాగ్‌లు అదిరిపోయాయి. ఈ చిత్రంలో అథర్వా, పూజా హెగ్డేలు ప్రత్యేకపాత్రలో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
 
Advertisement
Advertisement