టీజర్‌ వచ్చేస్తోంది | Varun Tej Valmiki Movie Release On September 13th | Sakshi
Sakshi News home page

టీజర్‌ వచ్చేస్తోంది

Aug 9 2019 2:48 AM | Updated on Aug 22 2019 9:35 AM

Varun Tej Valmiki Movie Release On September 13th - Sakshi

లొకేషన్‌లో సినిమాటోగ్రాఫర్‌ రిచర్డ్‌తో పూజ, వరుణ్‌ తేజ్‌

వరుణ్‌ తేజ్‌ విలనిజమ్‌ ఎలా ఉంటుందో చిన్న ప్రీ–టీజర్‌తో టీజ్‌ చేశారు ‘వాల్మీకి’ టీమ్‌. ఇప్పుడు టీజర్‌ను రెడీ చేస్తున్నారని తెలిసింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌తేజ్, అథర్వ మురళి నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. పూజా హెగ్డే కథానాయిక. 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ నిర్మిస్తోంది. తమిళ చిత్రం ‘జిగర్తండా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇందులో వరుణ్‌ తేజ్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు.

ఓ వారం పది రోజుల్లో చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయడానికి టీమ్‌ ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. షూటింగ్‌ కూడా చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. మరో 10–15 రోజుల్లో షూటింగ్‌ మొత్తం పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టేస్తారని సమాచారం. సెప్టెంబర్‌ 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: అయాంకా బోస్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement