లోఫర్ లవ్‌స్టోరీ | Varun Tej Puri Jagan New movie loafer starts | Sakshi
Sakshi News home page

లోఫర్ లవ్‌స్టోరీ

Jul 8 2015 10:37 PM | Updated on Sep 3 2017 5:08 AM

లోఫర్  లవ్‌స్టోరీ

లోఫర్ లవ్‌స్టోరీ

పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎవరికీ భయపడడు. ఎంతమంది ఉన్నా సరే లెక్కచేయడు. పదునెక్కిన సంభాషణలతో చురకత్తిలా దూసుకెళ్తుంటాడు

పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎవరికీ భయపడడు. ఎంతమంది ఉన్నా సరే లెక్కచేయడు. పదునెక్కిన సంభాషణలతో చురకత్తిలా దూసుకెళ్తుంటాడు... ఇవి ఆయన సినిమాలో ప్రతి హీరోకి ఉండే మినిమమ్ క్వాలిటీస్. ఇవే ఆయన అభిమానులకు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్. మరి... ఇలాంటి క్వాలిటీస్ వరుణ్‌తేజ్‌లో కనిపిస్తే..? తొలి సినిమా ‘ముకుంద’తోనే మంచి మార్కులు కొట్టేసిన వరుణ్ తేజ్, ఇప్పుడు పూరి మార్కు హీరోయిజమ్‌తో ‘లోఫర్’గా రెడీ అవుతున్నారు. ఇందులో దిశా పటాని కథానాయిక. శ్రీ శుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్న  ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు కెమెరా స్విచాన్ చేయగా, పూరి జగన్నాథ్ సతీమణి లావణ్య, నాగబాబు సతీమణి పద్మజ  క్లాప్ నిచ్చారు.
 
 ‘‘నా కెరీర్ బిగినింగ్‌లోనే పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో చేయడం చాలా ఆనందంగా ఉంది.  మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా  నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అని హీరో వరుణ్‌తేజ్ అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ లవ్‌స్టోరి. వరుణ్‌తేజ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 21 నుంచి జోధ్‌పూర్‌లో భారీ షెడ్యూల్ ఉంటుంది. ఈ చిత్రాన్ని విజయదశమికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రాహకుడు: పీజీ విందా.

Advertisement
 
Advertisement
Advertisement