మరో ప్రయోగానికి రెడీ | varun tej next movie director gopichand malineni | Sakshi
Sakshi News home page

మరో ప్రయోగానికి రెడీ

Oct 28 2015 9:20 AM | Updated on Mar 22 2019 1:53 PM

మరో ప్రయోగానికి రెడీ - Sakshi

మరో ప్రయోగానికి రెడీ

మెగా ఫ్యామిలీ హీరో అంటే రెడీమేడ్ ఫ్యాన్ ఫాలోయింగ్తో మాస్ హీరోగా ఎంట్రీ ఇస్తారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ సాఫ్ట్ లవ్ స్టోరితో పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో...

మెగా ఫ్యామిలీ హీరో అంటే రెడీమేడ్ ఫ్యాన్ ఫాలోయింగ్తో మాస్ హీరోగా ఎంట్రీ ఇస్తారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ సాఫ్ట్ లవ్ స్టోరీతో పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'ముకుంద' సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్, తొలి సినిమాతో కమర్షియల్ స్టార్ అనిపించుకోలేకపోయినా నటుడిగా మంచి మార్కులే సాధించాడు. అదే జోష్లో 'కంచె' సినిమాతో మరోసారి సమ్థింగ్ స్పెషల్గా ప్రూవ్ చేసుకున్నాడు.

'కంచె' సినిమాతో కమర్షియల్గా కూడా సక్సెస్ అయిన వరుణ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'మా అమ్మ సీతామాలక్ష్మీ' (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు. పూరితో చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ కావటంతో, నెక్ట్స్ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాలని ప్లాన్ చేస్తున్నాడు వరుణ్.

డాన్ శీను, బలుపు, పండగచేస్కో సినిమాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ మలినేని, తొలిసారిగా ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించనున్నాడు. ఇప్పటికే కథ కూడా ఫైనల్ కావటంతో పూరి సినిమా పూర్తి కాగానే వరుణ్, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement