
ఈ విషయంలో చాలామంది భయపెట్టారు!
ప్రతి క్షణం ప్రేమించి చేశానీ ‘కంచె’ సినిమా. హాలీవుడ్ సినిమా చేస్తున్న ఫీలింగ్ కలిగింది.
- వరుణ్ తేజ్
‘‘ప్రతి క్షణం ప్రేమించి చేశానీ ‘కంచె’ సినిమా. హాలీవుడ్ సినిమా చేస్తున్న ఫీలింగ్ కలిగింది. చాలా మంది భయపెట్టినా, తెగింపుతో చేశాను. కచ్చితంగా మంచి అటెంప్ట్ అవుతుంది’’ అని యువ హీరో వరుణ్‌తేజ్ చెప్పారు. తొలి చిత్రం ‘ముకుంద’ తరువాత రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న మలి చిత్రం ‘కంచె’ గురించి వరుణ్‌తేజ్ చెప్పిన కబుర్లు...
* క్రిష్ నాకు ఫ్రెండ్ లాంటి వాడు. నేను క్రిష్ ఫ్యాన్‌ను. ఆయన ప్రతి సినిమాలోనూ హ్యుమానిటీ ఉంటుంది. ‘అసలు ఈ కథను ఎలా ఊహించారు క్రిష్’ అని నేనెన్నిసార్లు అడిగినా దాటేసేవాడు.
* ‘కంచె’ కోసం చాలా కష్టపడి డైలాగ్ డెలివ రీ, బాడీ లాంగ్వేజ్... వీటన్నిటి కోసం శిక్షణ తీసుకున్నా. విలేజ్ ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ లాంటి ఆ తరం అగ్ర హీరోలు చేసిన పాత తెలుగు సినిమాల్లోని పాత్రలు బాగా గమనించా.
* ఈ సినిమాలో బ్లాస్ట్‌లు, గన్ షూటింగ్‌లు ఎక్కువుంటాయి. ఒక్కోసారి భయం వేసినా, ధైర్యంగా చేసేశాం. ఇందులో 1932 నాటి గన్ వాడా. అందుకోసం జార్జియాలో ఒకతని దగ్గర శిక్షణ తీసుకున్నా. నాకు చిన్నప్పట్నుంచి గన్ షూటింగ్ అంటే ఇష్టం. పవన్ కల్యాణ్ బాబాయ్ సినిమాల్లో గన్స్ ఎక్కువ వాడుతుంటారు. ఆ సినిమాలు చూసి నాక్కూడా ఓ పేషన్ ఏర్పడింది. బాబాయ్ నా చిన్నప్పుడు రెండు, మూడు గన్స్ కొనిచ్చారు.
* ‘ముకుంద’ చూసి పెదనాన్న చిరంజీవి గారు కొన్ని సలహాలు చెప్పారు. కొన్ని చోట్ల ఇంకా బాగా చేయాల్సింది అన్నారు. బాబాయ్ కూడా అదే చెప్పారు.
* నా సిస్టర్ నీహారిక హీరోయిన్‌గా రావడం మా ఫ్యామిలీ అందరికీ హ్యాపీనే. ఇదేం బ్యాడ్ ప్రొఫెషన్ కాదు. హీరోయిన్లను డీగ్రేడ్ చేయొద్దు. అభిమానులు కూడా ఈ విషయమై నాన్నగారి దగ్గర ఫీలైతే, వాళ్లకు నచ్చజెప్పి పంపించారు. అభిమానులే మా మెగా ఫ్యామిలీకి బ్యాక్‌బోన్. వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అందుకే నాన్న కన్విన్స్ చేశారు.
* పూరి జగన్నాథ్ డెరైక్షన్‌లో చాలా ఎంజాయ్ చే స్తూ ‘లోఫర్’ సినిమా చేశా. ఆయన హార్ట్ చాలా యంగ్. ఆయన ప్రతి యాక్టర్‌కు స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తారు. ‘లోఫర్’ టైటిల్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ‘మా అమ్మ మహాలక్ష్మి’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఫైనల్‌గా పూరిగారు డిసైడ్ చేస్తారు.