Kanche Movie
-
స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు)
-
రిపబ్లిక్ డే: ఓటీటీలో చూడాల్సిన దేశభక్తి సినిమాలివే!
రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు స్కూళ్లు, కార్యాలయాలు జాతీయ జెండాలతో అలంకరించుకుంటాయి. దేశభక్తిని పెంపొందించేలా నినాదాలు, పాటలతో ఊరూవాడా హోరెత్తిపోతుంది. మనకు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినవారిని, ఆ పోరాటంలో ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడంతో మనసు ఉప్పొంగుతుంది. ఇక ఇంట్లో టీవీ ఆన్ చేస్తే ఏ ఛానల్లో చూసినా దేశభక్తి సినిమాలే! అవును మరి.. గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి సినిమా చూడకపోతే ఆ రోజు అసంపూర్తిగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు ఓటీటీలో ఈ సినిమాలు చూసేయండి.. వూట్ ► ఖడ్గం ► మేజర్ చంద్రకాంత్ (ప్రైమ్‌లోనూ లభ్యం) అమెజాన్ ప్రైమ్ వీడియో ► భారతీయుడు ► సర్దార్ పాపారాయుడు ► రాజీ ► సర్దార్ ఉద్ధమ్ ► చక్‌దే ఇండియా ► మణికర్ణిక ► షేర్షా హాట్‌స్టార్ ► మంగళ్‌పాండే ► కంచె నెట్‌ఫ్లిక్స్ ► మేజర్ ► లగాన్ ► ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ ► స్వేడ్స్ ► రంగ్ దే బసంతి జీ5 ► ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ► సుభాష్ చంద్రబోస్ ఇవే కాకుండా మేజర్ చంద్రకాంత్, సైరా నరసింహారెడ్డి, చిట్టగాంగ్, ఎల్ఓసీ కార్గిల్, మంగళ్ పాండే, బార్డర్, ఇలా మరోన్నో సినిమాలు దేశభక్తి ఆధారంగా తెరకెక్కినవే! ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఓ మంచి సినిమాతో సెలబ్రేట్ చేసుకోండి. -
బర్త్‌డే విషెస్ చెప్పిన ధూపాటి హరిబాబు
తనకు తెలుగు సినిమాల్లో మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ)కు పుట్టిన రోజు సందర్భంగా హీరో వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపాడు. తొలి సినిమా ముకుంద పెద్దగా పేరు తేకపోయినా.. కంచె సినిమాతో మాత్రం ఒక్కసారిగా వరుణ్ తేజ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రెండో ప్రపంచయుద్ధం నాటి పరిస్థితుల మధ్య సాగే ప్రేమకథతో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని వరుణ్‌ను అందరూ ప్రశంసించారు. దీనికి తోడు ఇప్పుడు తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లోఫర్' సినిమా కూడా క్రిస్మస్ సమయంలో విడుదల కానుంది. దాంతో మంచి జోష్ మీదున్న వరుణ్ తేజ్.. తనను నిలబెట్టిన దర్శకుడు క్రిష్‌కు బర్త్‌డే విషెస్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తనను ధూపాటి హరిబాబుగా (కంచెలో హీరో పేరు) మార్చిన క్రిష్‌కు వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే అని చెప్పాడు. A very very happy birthday to the man who made me dhoopati haribabu... @DirKrish love you man.. pic.twitter.com/BzSCVkgGx7 — Varun Tej (@IAmVarunTej) November 10, 2015 -
ఫాదర్‌గా చాలా గర్వపడుతున్నాను
-
ఆల్ ద బెస్ట్ బావా
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఓ సైనికుడి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన 'కంచె' సినిమా గురువారం విడుదల అవుతున్న నేపథ్యంలో.. తన బావ వరుణ్ తేజ్‌కు, సినిమా దర్శకుడు క్రిష్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుభాభినందనలు చెప్పాడు. బన్నీతో పాటు మరో టాప్ హీరో రానా కూడా ఈ సినిమాకు, సినిమా హీరోకు అభినందనలు చెప్పాడు. వెండితెర మీద సినిమా చూడటానికి తాను ఏమాత్రం ఆగలేకపోతున్నట్లు ట్వీట్ చేశాడు. థియేటర్లోనే కలుద్దాం అంటూ ఓ మాట విసిరేశాడు. వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కంచె' దసరా కానుకగా అక్టోబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దసరా రేసులో మరే పెద్ద సినిమాలు లేకపోవడం ఒక రకంగా ఈ సినిమాకు ప్లస్ పాయింటే అవుతుంది. దీన్ని వీలైనంతగా ప్రమోట్ చేసుకోడానికి వరుణ్ తేజ్ చాలా కష్టపడుతున్నాడు. ట్విట్టర్ అభిమానులతో సాయంత్రం 5 గంటల నుంచి లైవ్ చాట్ చేస్తానని ప్రకటించాడు. ఇంతకుముందు చేసిన 'ముకుంద' సినిమాలో కూడా లవర్ బోయ్ పాత్రే అయినా.. ఇందులో పాత్రకు, దానికి చాలా తేడా ఉంటుందని చెబుతున్నారు. I wish my Cousin @IAmVarunTej n my Dear dir @DirKrish all the best for #Kanche movie releasing this Thursday OCT 22nd ! — Allu Arjun (@alluarjun) October 20, 2015 Can't wait to see this in the big screen @IAmVarunTej @DirKrish!! See you at the movies boys!! pic.twitter.com/N6VjvmclOf — Rana Daggubati (@RanaDaggubati) October 21, 2015 -
ఈ విషయంలో చాలామంది భయపెట్టారు!
- వరుణ్ తేజ్ ‘‘ప్రతి క్షణం ప్రేమించి చేశానీ ‘కంచె’ సినిమా. హాలీవుడ్ సినిమా చేస్తున్న ఫీలింగ్ కలిగింది. చాలా మంది భయపెట్టినా, తెగింపుతో చేశాను. కచ్చితంగా మంచి అటెంప్ట్ అవుతుంది’’ అని యువ హీరో వరుణ్‌తేజ్ చెప్పారు. తొలి చిత్రం ‘ముకుంద’ తరువాత రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న మలి చిత్రం ‘కంచె’ గురించి వరుణ్‌తేజ్ చెప్పిన కబుర్లు... * క్రిష్ నాకు ఫ్రెండ్ లాంటి వాడు. నేను క్రిష్ ఫ్యాన్‌ను. ఆయన ప్రతి సినిమాలోనూ హ్యుమానిటీ ఉంటుంది. ‘అసలు ఈ కథను ఎలా ఊహించారు క్రిష్’ అని నేనెన్నిసార్లు అడిగినా దాటేసేవాడు. * ‘కంచె’ కోసం చాలా కష్టపడి డైలాగ్ డెలివ రీ, బాడీ లాంగ్వేజ్... వీటన్నిటి కోసం శిక్షణ తీసుకున్నా. విలేజ్ ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ లాంటి ఆ తరం అగ్ర హీరోలు చేసిన పాత తెలుగు సినిమాల్లోని పాత్రలు బాగా గమనించా. * ఈ సినిమాలో బ్లాస్ట్‌లు, గన్ షూటింగ్‌లు ఎక్కువుంటాయి. ఒక్కోసారి భయం వేసినా, ధైర్యంగా చేసేశాం. ఇందులో 1932 నాటి గన్ వాడా. అందుకోసం జార్జియాలో ఒకతని దగ్గర శిక్షణ తీసుకున్నా. నాకు చిన్నప్పట్నుంచి గన్ షూటింగ్ అంటే ఇష్టం. పవన్ కల్యాణ్ బాబాయ్ సినిమాల్లో గన్స్ ఎక్కువ వాడుతుంటారు. ఆ సినిమాలు చూసి నాక్కూడా ఓ పేషన్ ఏర్పడింది. బాబాయ్ నా చిన్నప్పుడు రెండు, మూడు గన్స్ కొనిచ్చారు. * ‘ముకుంద’ చూసి పెదనాన్న చిరంజీవి గారు కొన్ని సలహాలు చెప్పారు. కొన్ని చోట్ల ఇంకా బాగా చేయాల్సింది అన్నారు. బాబాయ్ కూడా అదే చెప్పారు. * నా సిస్టర్ నీహారిక హీరోయిన్గా రావడం మా ఫ్యామిలీ అందరికీ హ్యాపీనే. ఇదేం బ్యాడ్ ప్రొఫెషన్ కాదు. హీరోయిన్లను డీగ్రేడ్ చేయొద్దు. అభిమానులు కూడా ఈ విషయమై నాన్నగారి దగ్గర ఫీలైతే, వాళ్లకు నచ్చజెప్పి పంపించారు. అభిమానులే మా మెగా ఫ్యామిలీకి బ్యాక్‌బోన్. వాళ్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అందుకే నాన్న కన్విన్స్ చేశారు. * పూరి జగన్నాథ్ డెరైక్షన్‌లో చాలా ఎంజాయ్ చే స్తూ ‘లోఫర్’ సినిమా చేశా. ఆయన హార్ట్ చాలా యంగ్. ఆయన ప్రతి యాక్టర్‌కు స్పెసిఫిక్ బాడీ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తారు. ‘లోఫర్’ టైటిల్ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. ‘మా అమ్మ మహాలక్ష్మి’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. ఫైనల్‌గా పూరిగారు డిసైడ్ చేస్తారు.