ఆల్ ద బెస్ట్ బావా | allu arjun and rana wish kanche movie all the best | Sakshi
Sakshi News home page

ఆల్ ద బెస్ట్ బావా

Oct 21 2015 4:30 PM | Updated on Sep 27 2018 8:48 PM

ఆల్ ద బెస్ట్ బావా - Sakshi

ఆల్ ద బెస్ట్ బావా

'కంచె' సినిమా గురువారం విడుదల అవుతున్న నేపథ్యంలో.. తన బావ వరుణ్ తేజ్‌కు, సినిమా దర్శకుడు క్రిష్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుభాభినందనలు చెప్పాడు.

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఓ సైనికుడి ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన 'కంచె' సినిమా గురువారం విడుదల అవుతున్న నేపథ్యంలో.. తన బావ వరుణ్ తేజ్‌కు, సినిమా దర్శకుడు క్రిష్‌కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుభాభినందనలు చెప్పాడు.  బన్నీతో పాటు మరో టాప్ హీరో రానా కూడా ఈ సినిమాకు, సినిమా హీరోకు అభినందనలు చెప్పాడు. వెండితెర మీద సినిమా చూడటానికి తాను ఏమాత్రం ఆగలేకపోతున్నట్లు ట్వీట్ చేశాడు. థియేటర్లోనే కలుద్దాం అంటూ ఓ మాట విసిరేశాడు.

వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 'కంచె' దసరా కానుకగా అక్టోబర్  22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. దసరా రేసులో మరే పెద్ద సినిమాలు లేకపోవడం ఒక రకంగా ఈ సినిమాకు ప్లస్ పాయింటే అవుతుంది. దీన్ని వీలైనంతగా ప్రమోట్ చేసుకోడానికి వరుణ్ తేజ్ చాలా కష్టపడుతున్నాడు. ట్విట్టర్ అభిమానులతో సాయంత్రం 5 గంటల నుంచి లైవ్ చాట్ చేస్తానని ప్రకటించాడు. ఇంతకుముందు చేసిన 'ముకుంద' సినిమాలో కూడా లవర్ బోయ్ పాత్రే అయినా.. ఇందులో పాత్రకు, దానికి చాలా తేడా ఉంటుందని చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement