'ఫేస్బుక్ లైవ్ చాట్ @ 8.18 పియం' | variety Title for Ram Charan Sukumar New Movie | Sakshi
Sakshi News home page

'ఫేస్బుక్ లైవ్ చాట్ @ 8.18 పియం'

Nov 8 2016 12:04 PM | Updated on Jul 26 2018 12:59 PM

'ఫేస్బుక్ లైవ్ చాట్ @ 8.18 పియం' - Sakshi

'ఫేస్బుక్ లైవ్ చాట్ @ 8.18 పియం'

సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించటమే కాదు. సినిమా మీద ఆసక్తి కలిగేలా టైటిల్ నిర్ణయించటం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మన ఫిలిం మేకర్స్ సినిమా మేకింగ్ తో పాటు టైటిల్ నిర్ణయించటం పై కూడా...

సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించటమే కాదు. సినిమా మీద ఆసక్తి కలిగేలా టైటిల్ నిర్ణయించటం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే మన ఫిలిం మేకర్స్ సినిమా మేకింగ్ తో పాటు టైటిల్ నిర్ణయించటం పై కూడా అదే స్థాయిలో కసరత్తులు చేస్తారు. ముఖ్యం మేకింగ్ విషయంలో డిఫరెంట్ గా ఆలోచించే సుకుమార్ లాంటి క్రియేటర్స్, టైటిల్స్ విషయంలో కూడా తమ మార్క్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సినిమాకు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ పెట్టిన సుకుమార్, తన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాకు కుమార్ 21ఎఫ్ అనే టైటిల్ ను నిర్ణయించి మంచి విజయం సాధించాడు. అదే బాటలో త్వరలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కించబోయే సినిమాకు కూడా వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశాడట. 'ఫేస్బుక్ లైవ్ చాట్ ఎట్ 8.18 పియం' అనే టైటిల్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా అభిమానులు మాత్రం ఈ టైటిల్ పై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement