వంశీతో మహేష్ సినిమా ఎప్పుడంటే..? | Vamsi paidipally Mahesh babu movie from 2017 june | Sakshi
Sakshi News home page

వంశీతో మహేష్ సినిమా ఎప్పుడంటే..?

Oct 30 2016 8:48 AM | Updated on Sep 4 2017 6:46 PM

వంశీతో మహేష్ సినిమా ఎప్పుడంటే..?

వంశీతో మహేష్ సినిమా ఎప్పుడంటే..?

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగాం పీవీపీ బ్యానర్ మహేష్ మరో సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈసినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తరువాత మహేష్...

మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగాం పీవీపీ బ్యానర్ మహేష్ మరో సినిమా చేస్తున్నట్టుగా ఎనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈసినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడంటూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తరువాత మహేష్ నుంచి గాని, పీవీపీ సంస్ధ నుంచి గాని ఈ సినిమాపై ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో వంశీ, మహేష్ల కాంబినేషన్లో సినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపించింది. అదే సమయంలో మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఎనౌన్స్ చేయటంతో ఇక వంశీ, మహేష్ల సినిమా లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్.

అయితే తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ.., ఈ ప్రాజెక్ట్పై క్లారిటీ ఇచ్చింది. మహేష్ బాబుతో తమ నెక్ట్స్ సినిమా వచ్చే ఏడాది జూన్లో ప్రారంభమవుతుందని తెలిపింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఈ సినిమా ఉంటుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో కింగ్ నాగార్జునతోనూ ఓ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ చేయనునున్నట్టుగా తెలిపారు. ఓంకార్ దర్శకత్వంలో రాజుగారిగది సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement