
‘కిక్, రేసుగుర్రం, టెంపర్’ వంటి పలు హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. తొలి సినిమాని అల్లు అర్జున్‌తో చేసిన వంశీ మలి సినిమాకి రవితేజను హీరోగా అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ మాస్ మహారాజ కోసం కథ సిద్ధం చేస్తున్నారని సమాచారమ్. రవితేజ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటైన ‘కిక్’ సినిమాకు కథ అందించింది వంశీయే. అప్పటి నుంచి వీరిమధ్య మంచి స్నేహబంధం ఉంది. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, సంతోష్ శ్రీనివాస్‌తో ‘తేరి’ రీమేక్‌లో నటిస్తున్నారు రవితేజ. ఆ తర్వాత వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో నటిస్తారట. ఈ చిత్రాలు పూర్తయ్యాక వంశీతో చేసే సినిమా పట్టాలెక్కుతుందేమో? వెయిట్ అండ్ సీ.