నవ్వులు పంచే లోకం | vadivelu yamalokam movie updates | Sakshi
Sakshi News home page

నవ్వులు పంచే లోకం

Apr 5 2019 3:52 AM | Updated on Apr 5 2019 3:52 AM

vadivelu yamalokam movie updates - Sakshi

శ్రియ

‘‘ఇప్పటి వరకూ యమలోకం బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘యమలోకం’ వాటన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. రెండున్నర గంటలసేపు ప్రేక్షకుడు ఈ లోకాన్ని మరపించేలా మా సినిమా ఉంటుంది’’ అంటున్నారు కె.వి. రావు. తమిళ హాస్య నటుడు వడివేలు నటించిన చిత్రం ‘ఇంద్రలోగత్తిల్‌ నా అళగప్పన్‌’ చిత్రాన్ని నిర్మాత కె.వి.రావు తెలుగులో ‘యమలోకం’ పేరుతో అనువదిస్తున్నారు.

‘ఇంద్రలోక సుందరవదన’ అనేది ట్యాగ్‌లైన్‌.ఇందులో యముడు, ఇంద్రుడు, నరుడు మూడు పాత్రల్లో కనిపిస్తారు వడివేలు. కె.విరావు మాట్లాడుతూ – ‘‘ తెలుగు ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రం కావడంతో తెలుగు హక్కులను మేం సొంతం చేసుకున్నాం. మూడు పాత్రల్లో వడివేలు అద్భుతంగా నటించారు. శ్రియ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. డబ్బింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శహభాష్‌ మురళి, దర్శకుడు: తంబి రామయ్య.

Advertisement
 
Advertisement
Advertisement