బుద్ధిమంతుడు | Upendra Buddhivantha 2 is launched | Sakshi
Sakshi News home page

బుద్ధిమంతుడు

May 26 2019 1:47 AM | Updated on May 26 2019 1:47 AM

Upendra Buddhivantha 2 is launched - Sakshi

ఉపేంద్ర

ఉపేంద్ర బుద్ధిమంతుడిగా మారిపోయారు. నిజాలను ముక్కుసూటిగా, మొహమాటం లేకుండా చెప్పే పాత్రలనూ, అప్పుడప్పుడు కొంచెం తిక్క పాత్రలనూ పోషిస్తారు ఉపేంద్ర. కానీ తాజా చిత్రంలో మాత్రం బుద్ధిమంతుడిగా కనిపించబోతున్నారట. ఉపేంద్ర హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రానికి ‘బుద్ధివంతా 2’(బుద్దిమంతుడు 2) అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. 2013లో ‘బుద్ధివంతా’ అనే చిత్రంలో ఉపేంద్ర యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘బుద్ధిమంతుడు’ టైటిల్‌తో రిలీజ్‌ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా మౌర్య దర్శకత్వం వహిస్తున్న ‘బుద్ధివంతా 2’ ఇటీవలే ప్రారంభమైంది. మరోవైపు ఉపేంద్ర నటించిన ‘ఐ లవ్‌ యూ’ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement