ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇన్ఫినిటీ

Upcoming Hollywood Movies 2018 Special - Sakshi

హాలీవుడ్‌ స్పైస్‌

సమ్మర్‌ వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయ్‌.. పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు చక్కగా సినిమాలు చూసే టైమ్‌. సాయంకాలాలు అలా థియేటర్లలో వాలిపోయి సినిమాలను ఎంజాయ్‌ చేసే టైమ్‌. మరి మనకు సమ్మర్‌ అప్పుడే వచ్చేసింది కానీ యూఎస్‌లో ఇంకో రెండు నెలలు వెయిట్‌ చెయ్యాలి సమ్మర్‌కు. మనకైతే సమ్మర్‌ వేడిని పుట్టించేందుకు వాళ్ల స్ప్రింగ్‌ సీజ్‌న్‌లోనే భారీ బడ్జెట్‌ హాలీవుడ్‌ సినిమాలు వచ్చేస్తున్నాయి. ‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’  మొదలుకొని ‘డెడ్‌పూల్‌ 2’ వరకు ఇండియన్‌ అభిమానులను అలరించేందుకు హాలీవుడ్‌ రెడీ అయిపోయింది. ఆ సినిమాలను ఒకసారి పలకరించుకొద్దాం..

అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌
‘అవెంజర్స్‌ : ఇన్ఫినిటీ వార్‌’.. సమ్మర్‌లో ఈ ఒక్క సినిమా కోసం యాక్షన్‌ సినిమా అభిమానులందరూ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు కాబట్టి ఓపెనింగ్స్‌ కూడా అదిరిపోయేలా ఉంటాయని ట్రేడ్‌ భావిస్తోంది. సూపర్‌మేన్, స్పైడర్‌ మేన్, ఐరన్‌ మేన్‌.. ఇలా మనల్ని మెప్పించిన సూపర్‌ హీరోలంతా ఒక దగ్గర చేరి ఒకే స్క్రీన్‌ మీద కనిపిస్తే? అంతమంది సూపర్‌హీరోలు ఒకేసారి ఫైట్స్‌ చేస్తూ ఉంటే? అవెంజర్స్‌ అందుకు స్పెషల్‌. మార్వెల్‌ కామిక్స్‌ క్రియేట్‌ చేసిన సూపర్‌హీరోలంతా ఉంటారు ఈ సినిమాలో. వాళ్లు చేసే యాక్షన్, అడ్వెంచర్సే ఈ సినిమాకు హైలైట్‌. ఏప్రిల్‌ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది అవెంజర్స్‌. ఈ సమ్మర్‌లో ఇదే అతిపెద్ద సినిమా.

డెడ్‌పూల్‌ 2
అవెంజర్స్‌ రిలీజైన సరిగ్గా మూడు వారాలకు వస్తుంది ‘డెడ్‌పూల్‌ 2’. 2016లో వచ్చిన ‘డెడ్‌పూల్‌’కు సీక్వెల్‌ ఇది. అవెంజర్స్‌లో ఒక క్యారెక్టర్‌ అయిన డెడ్‌పూల్‌ను ఫుల్‌లెంగ్త్‌ రోల్‌లో ఎంజాయ్‌ చేయడానికి ‘డెడ్‌పూల్‌ 2’ చూడాల్సిందే మరి! సూపర్‌హీరో జానర్లో ఒక కొత్త ప్రయోగమైన డెడ్‌పూల్‌ తరహాలోనే సీక్వెల్‌ కూడా ఉంటుందట. ట్రైలర్‌ అయితే సినిమా ఫుల్‌ ఆన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందని స్పష్టం చేసేసింది. మే 18న విడుదలవుతోన్న ఈ సినిమాకు ఇండియాలోనూ భారీ క్రేజ్‌ ఉండడాన్ని విశేషంగా చెప్పుకోవాలి.

జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌
మనకు సమ్మర్‌ అప్పుడప్పుడే పూర్తవుతూ, చిరుజల్లులు పలకరించే సమయానికి సీజన్‌ను గ్రాండ్‌గా ఎండ్‌ చేసేందుకు ‘జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌’ సినిమా వచ్చేస్తోంది. జురాసిక్‌ పార్క్‌ నుంచి మొదలుపెడితే జురాసిక్‌ వరల్డ్‌ వరకూ ఈ సిరీస్‌ గురించి చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద చరిత్ర. సాధారణంగానే జురాసిక్‌ పార్క్‌ సిరీస్‌కు ఇండియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. అందుకు ఏమాత్రం తక్కువ లేకుండా ఈ కొత్త సినిమా వస్తోంది. 2015లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌తో పోల్చితే ఎన్నోరెట్లు ఎక్కువ అడ్వెంచర్లు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్‌ ఇప్పటికే అభిమానులకు ఇవ్వాల్సిన కిక్‌ అంతా ఇచ్చేస్తోంది. జూన్‌ 22న ఈ సినిమా విడుదలవుతోంది. హాలీవుడ్‌ రికార్డులను తిరగరాసే సినిమాగా ‘జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌డమ్‌’కు ప్రచారం కల్పిస్తోంది యూనివర్సల్‌ పిక్చర్స్‌.

పసిఫిక్‌ రిమ్‌ అప్‌రైజింగ్‌  
మొన్నీమధ్యే బెస్ట్‌ డైరెక్టర్‌గా ఆస్కార్‌ అందుకున్న గెలెర్మో డెల్తోరో గుర్తున్నాడు కదా? ఆయన దర్శకత్వంలో 2013లో వచ్చిన ‘పసిఫిక్‌ రిమ్‌’ సినిమాకు సీక్వెలే ఈ ‘పసిఫిక్‌ రిమ్‌ అప్‌రైజింగ్‌’. గెలెర్మో ఈసారి నిర్మాతగానే వ్యవహరించగా, స్టీవెన్‌ ఎస్‌ డెనైట్‌ దర్శకత్వం వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్‌ ఆన్‌ అడ్వెంచర్లు, యాక్షన్‌ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. గత వారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇండియాలోనూ భారీ ఎత్తునే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా దర్శకుడికి ఇది డెబ్యూట్‌. డెబ్యూట్‌తోనే ఇంత భారీ బడ్జెట్‌ సినిమాతో స్టీవెన్‌మెప్పించడం విశేషం.


 

రెడీ ప్లేయర్‌ వన్‌
సూపర్‌స్టార్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ కొత్త సినిమా ‘రెడీ ప్లేయర్‌ వన్‌’ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2045లో జరిగే సైన్స్‌ ఫిక్షన్‌ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు అంతటా సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మాస్టర్‌ స్టోరీటెల్లర్‌ అన్న తన స్థాయికి తగ్గట్టే స్పీల్‌బర్గ్‌ చేసిన ఈ ప్రయోగానికి ఇండియాలోనూ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సమ్మర్‌ను సూపర్‌ కూల్‌ గా మొదలుపెట్టిన సినిమా ‘రెడీ ప్లేయర్‌ వన్‌’ అనే చెప్పుకోవాలి.

ర్యాంపేజ్‌
ర్యాంపేజ్‌ కూడా సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌ కథే! ఒక విచిత్రమైన ప్రయోగంతో చిన్నపాటి గొరిల్లా భయంకరమైన మృగంలా మారిపోతుంది. ఆ తర్వాత అది చేసే విధ్వంసం, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. దాన్నుంచి ఈ ప్రపంచాన్ని హీరో ఎలా కాపాడాడన్నదే సినిమా. భారీ యాక్షన్‌ అడ్వెంచర్స్‌తో సినిమా నడుస్తుంది. ట్రైలర్‌ ఇప్పటికే అడ్వెంచర్‌ సినిమా అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోంది. డ్వేన్‌ జాన్సన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు బ్రాడ్‌ పేటోన్‌ దర్శకత్వం వహించారు.ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. పిల్లలే టార్గెట్‌గా సమ్మర్‌లో ఈ సినిమామంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్‌ భావిస్తోంది.

మరి ఈ భారీ బడ్జెట్‌ సినిమాల్లో మనకు సమ్మర్‌ బెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే సినిమా ఏదో, ఏ సినిమా ఎంతెంత వసూళ్లు రాబడుతుందో ఎదురుచూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top