breaking news
Deadpool 2
-
రానా విలన్.. రణ్వీర్ హీరో!
హెడ్డింగ్ చదివి రణ్వీర్ సింగ్, రానా కాంబినేషన్లో సినిమా సెట్ అయ్యిందనుకుంటున్నారా! అదేం కాదు. విషయం ఏంటంటే... రీసెంట్గా రిలీజైన హాలీవుడ్ చిత్రం ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ సినిమా తెలుగు వెర్షన్‌కు విలన్ థానోస్‌కు రానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ నెలలో విడుదల కానున్న హాలీవుడ్ చిత్రం ‘డెడ్‌పూల్ 2’ చిత్రంలోని హీరో ర్యాన్ రేనాల్డ్స్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు రణ్వీర్ సింగ్. అసలు విషయం అది. ‘‘కెనడియన్ యాక్టర్ రేనాల్డ్స్కు హిందీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు రణ్వీర్ సింగ్. ‘‘నేను డబ్బింగ్ చెప్పడానికి ఒకవేళ హిందీ కోర్స్‌లో జాయిన్ అయ్యుంటే అదో ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ అయి ఉండేది’’ అని సరదాగా అన్నారు రేనాల్డ్స్. -
ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ
సమ్మర్ వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయ్.. పిల్లలకు సెలవులు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు చక్కగా సినిమాలు చూసే టైమ్. సాయంకాలాలు అలా థియేటర్లలో వాలిపోయి సినిమాలను ఎంజాయ్ చేసే టైమ్. మరి మనకు సమ్మర్ అప్పుడే వచ్చేసింది కానీ యూఎస్‌లో ఇంకో రెండు నెలలు వెయిట్ చెయ్యాలి సమ్మర్‌కు. మనకైతే సమ్మర్ వేడిని పుట్టించేందుకు వాళ్ల స్ప్రింగ్ సీజ్న్లోనే భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ మొదలుకొని ‘డెడ్‌పూల్ 2’ వరకు ఇండియన్ అభిమానులను అలరించేందుకు హాలీవుడ్ రెడీ అయిపోయింది. ఆ సినిమాలను ఒకసారి పలకరించుకొద్దాం.. అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’.. సమ్మర్లో ఈ ఒక్క సినిమా కోసం యాక్షన్ సినిమా అభిమానులందరూ పిచ్చి పిచ్చిగా ఎదురుచూస్తున్నారు. అది అలాంటి ఇలాంటి సినిమా కాదు కాబట్టి ఓపెనింగ్స్ కూడా అదిరిపోయేలా ఉంటాయని ట్రేడ్ భావిస్తోంది. సూపర్‌మేన్, స్పైడర్ మేన్, ఐరన్ మేన్.. ఇలా మనల్ని మెప్పించిన సూపర్ హీరోలంతా ఒక దగ్గర చేరి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే? అంతమంది సూపర్‌హీరోలు ఒకేసారి ఫైట్స్ చేస్తూ ఉంటే? అవెంజర్స్ అందుకు స్పెషల్. మార్వెల్ కామిక్స్ క్రియేట్ చేసిన సూపర్హీరోలంతా ఉంటారు ఈ సినిమాలో. వాళ్లు చేసే యాక్షన్, అడ్వెంచర్సే ఈ సినిమాకు హైలైట్. ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది అవెంజర్స్. ఈ సమ్మర్లో ఇదే అతిపెద్ద సినిమా. డెడ్‌పూల్ 2 అవెంజర్స్ రిలీజైన సరిగ్గా మూడు వారాలకు వస్తుంది ‘డెడ్‌పూల్ 2’. 2016లో వచ్చిన ‘డెడ్‌పూల్’కు సీక్వెల్ ఇది. అవెంజర్స్‌లో ఒక క్యారెక్టర్ అయిన డెడ్‌పూల్‌ను ఫుల్‌లెంగ్త్ రోల్లో ఎంజాయ్ చేయడానికి ‘డెడ్‌పూల్ 2’ చూడాల్సిందే మరి! సూపర్‌హీరో జానర్లో ఒక కొత్త ప్రయోగమైన డెడ్‌పూల్ తరహాలోనే సీక్వెల్ కూడా ఉంటుందట. ట్రైలర్ అయితే సినిమా ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని స్పష్టం చేసేసింది. మే 18న విడుదలవుతోన్న ఈ సినిమాకు ఇండియాలోనూ భారీ క్రేజ్ ఉండడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్ మనకు సమ్మర్ అప్పుడప్పుడే పూర్తవుతూ, చిరుజల్లులు పలకరించే సమయానికి సీజన్‌ను గ్రాండ్‌గా ఎండ్ చేసేందుకు ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’ సినిమా వచ్చేస్తోంది. జురాసిక్ పార్క్ నుంచి మొదలుపెడితే జురాసిక్ వరల్డ్ వరకూ ఈ సిరీస్ గురించి చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద చరిత్ర. సాధారణంగానే జురాసిక్ పార్క్ సిరీస్‌కు ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందుకు ఏమాత్రం తక్కువ లేకుండా ఈ కొత్త సినిమా వస్తోంది. 2015లో వచ్చిన జురాసిక్ వరల్డ్‌తో పోల్చితే ఎన్నోరెట్లు ఎక్కువ అడ్వెంచర్లు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ ఇప్పటికే అభిమానులకు ఇవ్వాల్సిన కిక్ అంతా ఇచ్చేస్తోంది. జూన్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. హాలీవుడ్ రికార్డులను తిరగరాసే సినిమాగా ‘జురాసిక్ వరల్డ్ : ఫాలెన్ కింగ్డమ్’కు ప్రచారం కల్పిస్తోంది యూనివర్సల్ పిక్చర్స్. పసిఫిక్ రిమ్ అప్రైజింగ్ మొన్నీమధ్యే బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అందుకున్న గెలెర్మో డెల్తోరో గుర్తున్నాడు కదా? ఆయన దర్శకత్వంలో 2013లో వచ్చిన ‘పసిఫిక్ రిమ్’ సినిమాకు సీక్వెలే ఈ ‘పసిఫిక్ రిమ్ అప్రైజింగ్’. గెలెర్మో ఈసారి నిర్మాతగానే వ్యవహరించగా, స్టీవెన్ ఎస్ డెనైట్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ ఆన్ అడ్వెంచర్లు, యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. గత వారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇండియాలోనూ భారీ ఎత్తునే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా దర్శకుడికి ఇది డెబ్యూట్. డెబ్యూట్‌తోనే ఇంత భారీ బడ్జెట్ సినిమాతో స్టీవెన్మెప్పించడం విశేషం. రెడీ ప్లేయర్ వన్ సూపర్‌స్టార్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ కొత్త సినిమా ‘రెడీ ప్లేయర్ వన్’ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2045లో జరిగే సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాకు అంతటా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మాస్టర్ స్టోరీటెల్లర్ అన్న తన స్థాయికి తగ్గట్టే స్పీల్బర్గ్ చేసిన ఈ ప్రయోగానికి ఇండియాలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్‌ను సూపర్ కూల్ గా మొదలుపెట్టిన సినిమా ‘రెడీ ప్లేయర్ వన్’ అనే చెప్పుకోవాలి. ర్యాంపేజ్ ర్యాంపేజ్ కూడా సైన్స్ ఫిక్షన్ జానర్ కథే! ఒక విచిత్రమైన ప్రయోగంతో చిన్నపాటి గొరిల్లా భయంకరమైన మృగంలా మారిపోతుంది. ఆ తర్వాత అది చేసే విధ్వంసం, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. దాన్నుంచి ఈ ప్రపంచాన్ని హీరో ఎలా కాపాడాడన్నదే సినిమా. భారీ యాక్షన్ అడ్వెంచర్స్‌తో సినిమా నడుస్తుంది. ట్రైలర్ ఇప్పటికే అడ్వెంచర్ సినిమా అభిమానులకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తోంది. డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు బ్రాడ్ పేటోన్ దర్శకత్వం వహించారు.ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. పిల్లలే టార్గెట్‌గా సమ్మర్లో ఈ సినిమామంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ భావిస్తోంది. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో మనకు సమ్మర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఏదో, ఏ సినిమా ఎంతెంత వసూళ్లు రాబడుతుందో ఎదురుచూడాలి. -
డబుల్ ఫన్
సూపర్ హీరో సినిమాలంటే ఎలా ఉండాలి? భారీ విజువల్ ఎఫెక్ట్స్.. అదిరిపోయే యాక్షన్ సీన్లు.. గాల్లోకి ఎగిరి విలన్ల భరతం పట్టే హీరో.. ఎలాంటి పనైనా ఇట్టే చేయగల పవర్స్.. విధ్వంసం సృష్టించే విలన్.. అబ్బా! ఒకటా రెండా సినిమా అంతా హంగామా. 2016లో ఇలాంటి అన్ని హంగులూ ఉంటూనే ఒక కొత్తదనం చూపించిన సూపర్ హీరో సినిమా వచ్చింది. దాని పేరు ‘డెడ్‌పూల్’. డెడ్‌పూల్ చూపిన కొత్తదనం ఏంటంటే.. కామెడీ, యాక్షన్ సినిమా అన్న బ్రాండ్‌నే ఏళ్లుగా సంపాదించి పెట్టుకున్న సూపర్ హీరో జానర్.. ‘డెడ్‌పూల్’తో కామెడీగా కూడా మెప్పించగలదని నిరూపించింది. ఈ ప్రయోగం సూపర్ హీరో జానర్ ఫ్యాన్స్‌కు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ‘డెడ్‌పూల్’ బ్లాక్‌బస్టర్ అయింది. దీంతో ఆ వెంటనే ‘డెడ్‌పూల్’కు సీక్వెల్‌ను పట్టుకొచ్చేసింది మార్వెల్ స్టూడియోస్. ఈ మధ్యే విడుదలైన ‘డెడ్‌పూల్ 2’ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కేబుల్ క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా విడుదల చేసిన ట్రైలర్ అయితే ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. డెడ్‌పూల్, కేబుల్ మధ్యన వచ్చే సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ రెండు క్యారెక్టర్స్‌తో ఇటు యాక్షన్, అటు కామెడీ రెండింటికీ తిరుగుండదని తెలుస్తోంది. 2018 మే 18న విడుదల కానున్న ఈ సినిమాకు డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించాడు. డెడ్‌పూల్ క్యారెక్టర్లో ర్యాన్ రేనాల్డ్స్ నటించాడు. -
షూటింగ్లో ప్రమాదం.. స్టంట్ మాస్టర్ మృతి
వాన్కవర్: హాలీవుడ్ లో ఓ విషాదం చోటుచేసుకుంది. డెడ్‌పూల్ పార్ట్ 2 షూటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకోగా, ఓ మహిళా స్టంట్ మాస్టర్ మృతి చెందారు. ఈ విషయాన్ని నటుడు ర్యాన్ రెనాల్డ్స్ తన ట్విట్టర్ లో తెలియజేశారు. సోమవారం బ్రిటీష్ కొలంబియాలోని వాన్కవర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. స్టంట్ మాస్టర్ ఓయ్ ఎస్జే హర్రిస్ రిహార్సల్ చేస్తోంది. వేగంగా బైక్ నడుపుతూ ఓ సిగ్నల్ ను క్రాస్ చేసింది. అయితే అక్కడ మలుపు తిరిగే క్రమంలో బైక్ ను అదుపు చేయలేక ఆమె పక్కనే ఉన్న ఓ మాల్ లోని తలుపులను ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే ఆమె చనిపోగా, పగిలిన అద్ధాలు, రక్తపు మరకల చిత్రాలు బయటకు రావటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. "ఈరోజు జరిగిన ఘటనతో నా గుండెలు బరువెక్కిపోయింది. డెడ్ పూల్ షూటింగ్ లో ప్రమాదం జరిగింది. అప్పటిదాకా మాతో నవ్వుతూ ఉన్న స్టంట్ మాస్టర్ ప్రాణాలు వదిలింది. ఇది ఊహించని పరిణామం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా" అని నటుడు ర్యాన్ పేర్కొన్నారు. భద్రతా చర్యలు పాటించకపోవటం మూలంగానే షూటింగ్ లలో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. చివరిసారిగా 1996లో బ్రిటీష్ కొలంబియాలో ఓ షూటింగ్ సందర్భంగా హెలికాప్టర్ నుంచి దూకిన ఓ స్టంట్ మాస్టర్ పారాచ్యూట్ ఓపెన్ కాకపోవటంతో ప్రాణాలు కోల్పోయాడు.