హీరోకి దర్శకుడు మళ్లీ ముద్దొచ్చాడు! | un expected kiss at Jagga Jasus promotion evevt | Sakshi
Sakshi News home page

హీరోకి దర్శకుడు మళ్లీ ముద్దొచ్చాడు!

Jun 13 2017 7:12 AM | Updated on Sep 5 2017 1:31 PM

హీరోకి దర్శకుడు మళ్లీ ముద్దొచ్చాడు!

హీరోకి దర్శకుడు మళ్లీ ముద్దొచ్చాడు!

సినిమా ప్రమోషన్లలో కొన్నిసార్లు వివాదాలు చోటుచేసుకుంటాయి.

ముంబయి: సినిమా ప్రమోషన్లలో కొన్నిసార్లు వివాదాలు చోటుచేసుకుంటాయి. మరికొన్ని సార్లు ప్రమోషన్‌లో కొందరి చర్యలు హాట్ టాపిక్‌గా మారతాయి. తాజాగా అలాంటిదే ఓ మూవీ ప్రమోషన్లో జరిగింది. వేదిక మీద ఉన్న హీరో ఒక్కసారిగా దర్శకుడి వద్దకు వచ్చి ఆయనను గట్టిగా పట్టుకుని లిప్ కిప్ ఇచ్చేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతయింది. ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు.. రణబీర్ కపూర్.. కాగా డైరెక్టర్ అనురాగ్ బసు. చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్న ప్రేమికులు రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జగ్గా జాసూస్. ఈ మూవీ జూలై 14న విడుదల కానున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది.

ఈ మూవీ ప్రమోషన్ లో హీరోహీరోయిన్లు రణబీర్, క్రతినాలతో పాటు దర్శకుడు అనురాగ్ బసు పాల్గొన్నారు. మరికాసేపట్లో ఈవెంట్ ముగుస్తుందనగా అనురాగ్ వద్దకు రణబీర్ వచ్చాడు. ఏదో విషయం చెప్పడానికి వచ్చాడనుకుని బసు.. హీరోకు మరింత దగ్గరగా జరిగాడు. ఇక అంతే.. క్షణాల్లో డైరెక్టర్ బసును గట్టిగా పట్టుకుని రణబీర్ లిప్ కిస్ ఇచ్చేశాడు. ఈ చర్యతో కత్రినాతో పాటు అక్కడున్న వారు షాకయ్యారు. మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేశాడని ఈ కిస్ హాట్ టాపిక్ గా మారింది. రణబీర్ ఇలా చేయడం మాత్రం కొత్తేం కాదు. గతంలో అనురాగ్ దర్శకత్వంలో నటించిన బర్ఫీ మూవీ ప్రమోషన్లోనూ ఇలాగే ఆయనను రణబీర్ ముద్దుపెట్టుకున్న విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement