ఆ డబ్బు చెల్లించేది లేదు! | Udhyanidhi Stalin files complaint against Kajal Aggarwal! | Sakshi
Sakshi News home page

ఆ డబ్బు చెల్లించేది లేదు!

Sep 10 2014 11:19 PM | Updated on Sep 2 2017 1:10 PM

ఆ డబ్బు చెల్లించేది లేదు!

ఆ డబ్బు చెల్లించేది లేదు!

తమిళ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌పై తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తానని నటి కాజల్ అగర్వాల్ అంటున్నారు. ‘నన్బేన్డా’ చిత్రంలో నటిస్తానని

తమిళ నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌పై తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఫిర్యాదు చేస్తానని నటి కాజల్ అగర్వాల్ అంటున్నారు. ‘నన్బేన్డా’ చిత్రంలో నటిస్తానని చెప్పి కాజల్ తీసుకున్న 40 లక్షల రూపాయలు అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదని ఉదయనిధి స్టాలిన్ తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనికి నటి కాజల్ అగర్వాల్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఆ సినిమాకు నేనిచ్చిన     కాల్‌షీట్స్‌ని వాళ్లు ఉపయోగించలేదు.
 
 అదే సమయంలో నేను తెలుగులో ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం వదులుకున్నాను. అందుకే నష్టపరిహారంగా ఆ 40 లక్షలు నేను చెల్లించను’’ అని కాజల్ చెప్పారు. ఉదయనిధి ఫిర్యాదుకు సంబంధించిన లేఖ అందగానే, తాను దక్షిణ భారత నటీనటుల సంఘంలో ఆయనపై ఫిర్యాదు చేస్తానని కాజల్ పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement