పాటల్లేని సినిమాలో ఇద్దరు హీరోయిన్లు..!

Two Heroines in Varun Tej Next film - Sakshi

ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న యంగ్ హీరో వరుణ్ తేజ్‌ త్వరలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించనున్నాడు. ఇప్పటికే ఘాజీ ఫేం సంకల్ప్‌ రెడ్డి దర్శకత‍్వంలో ఓ సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు వరుణ్‌. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌కు జోడిగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నా.. ఈ సినిమాలో పాటలు మాత్రం ఉండవని తెలుస్తోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ షూటింగ్ ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభం కానుంది. జ్ఞాన శేఖర్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top