3వేల పైరసీ సీడీలు స్వాధీనం | Two held, 3 thousand cinema Piracy CDs seized | Sakshi
Sakshi News home page

3వేల పైరసీ సీడీలు స్వాధీనం

Feb 3 2015 4:07 PM | Updated on Aug 11 2018 8:27 PM

సినిమా పైరసీలకు పాల్పడుతున్న ఇద్దరి వ్యక్తులను సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: సినిమా విడుదల కావటమే ఆలస్యం..  పైరసీ సీడీలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. సినిమా పూర్తిగా రూపుదిద్దుకోని బయటకు రావలంటే దాని వెనుక ఎందరో కష్టం ఆధారపడి ఉంటుంది. ఈ పైరసీదారులు సినిమా విడుదల కాగానే పైరసీ సీడీలు తయారుచేయడం వాటినీ అంతర్జాలంలోనూ, మార్కెట్లోనూ విడుదల చేస్తున్నారు. సినిమా విడుదలైన మరుసటిరోజే పైరసీ సీడీలు మార్కెట్లో రావటం..  సినిమా పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారింది. 
 

తాజాగా సినిమా పైరసీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 వేల పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన తెలుగు, హిందీ సినిమాల సీడీలు కూడా దొరికినట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement