క‌రోనా కాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన హీరో! | Twitter Slams Varun Dhawan For Shaking Hands With Cop | Sakshi
Sakshi News home page

అభిమానిని ఇడియ‌ట్ అని తిట్టిన హీరో

Apr 14 2020 8:23 AM | Updated on Apr 14 2020 8:46 AM

Twitter Slams Varun Dhawan For Shaking Hands With Cop - Sakshi

"చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి క‌ల‌ప‌కురా.. కాళ్లు కూడా మొక్కుతా అడుగు బ‌య‌ట పెట్ట‌కురా.." ఈ పాట ఇప్పుడు బాగా ఫేమ‌స్. అయితే ఓ హీరో మాత్రం ఈ నిబంధ‌న‌లను తుంగ‌లో తుక్కాడంటూ అభిమానులు విరుచుకుప‌డుతున్నారు. అంద‌రికీ ఆద‌ర్శంగా ఉండాల్సిన సెల‌బ్రిటీలే ఇలాంటి త‌ప్పు చేసి స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. విష‌యానికొస్తే బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో క‌రోనా వైర‌స్‌ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న ఓ పోలీసుకు చిరున‌వ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. (మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి)

దీంతో నెటిజ‌న్లు పెద్ద ఎత్తున అత‌నిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. "మాస్క్‌ క‌ట్టుకోలేదు, గ్ల‌వ్స్ ధ‌రించ‌లేదు, సామాజిక దూరం పాటించ‌లేదు, పైగా కొంచెం కూడా బుద్ధి లేకుండా పోలీసు అధికారికి షేక్ హ్యాండ్ ఇస్తూ అత‌ని ప్రాణాన్ని ప్ర‌మాదంలోకి నెడుతున్నావు. మీరు ఇదేనా అభిమానుల‌కు ఇచ్చే సందేశం?" అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై స్పందించిన హీరో ఇడియ‌ట్, అది రెండు నెల‌ల క్రితం దిగిన ఫొటో అని స‌మాధాన‌‌మిచ్చారు. ఇదిలా ఉండ‌గా వ‌రుణ్ ప్ర‌స్తుతం కూలీ నెంబ‌ర్‌1 సినిమాలో న‌టించ‌నుండ‌గా, అత‌నితో హీరోయిన్ సారా అలీఖాన్ జోడీ క‌ట్ట‌నుంది. (అమ్మ మంత్రం పని చేసింది)

Advertisement
 
Advertisement
Advertisement