జ్యోతికతో విదార్థ్‌.. | 'Tumhari Sulu' Tamil remake: Jyothika and Vidharth to be lead pair | Sakshi
Sakshi News home page

జ్యోతికతో విదార్థ్‌..

Apr 15 2018 7:36 AM | Updated on Sep 18 2019 2:56 PM

'Tumhari Sulu' Tamil remake: Jyothika and Vidharth to be lead pair - Sakshi

తమిళసినిమా: నటి జ్యోతిక నటిస్తున్నారంటే ఆ చిత్రంలో ఆమె పాత్రే ప్రధానంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా రీఎంట్రీ తరువాత ఆమె నటించిన 36 వయదినిలే చిత్రంలో నటుడు రఘు భర్తగా సపోర్టింగ్‌ పాత్రలో నటించారు. ఇక మగళీర్‌ మట్టుం చిత్రంలో జ్యోతికకు సపోర్ట్‌గా రేవతి, ఊర్వశి నటించారు. ఇటీవల నటించిన నాచియార్‌ చిత్రంలో జ్యోతిక ప్రాత్రే ప్రధానంగా ఉంటుంది. తాజాగా హిందీలో మంచి విజయాన్ని సాధించిన తుమ్హారి సుళు చిత్ర తమిళ రీమేక్‌లో విద్యాబాలన్‌ పాత్రలో జ్యోతిక నటించడానికి సిద్ధం అవుతున్నారు.

 దీనికి రాధామోహన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇందకు ఈయన దర్శకత్వంలో జ్యోతిక నటించిన మొళి చిత్రం మంచి ప్రశంసలను అందుకుంది. తుమ్హారి సుళు రీమేక్‌లో జ్యోతికకు భర్తగా సపోర్టింగ్‌ పాత్రలో నటుడు విదార్థ్‌ నటించడానికి కమిట్‌ అయ్యారన్నది తాజా సమాచారం.  ఇందులో ఇప్పటికే టాలీవుడ్‌ క్రేజీ నటి మంచులక్ష్మి ముఖ్యపాత్రలో నటించడానికి ఎంపికైన విషయం తెలిసిందే. అదే విధంగా నటుడు ఆర్‌జే. బాలాజి నటిస్తున్న ఈ చిత్రాన్ని బాఫ్టా మీడియా వర్క్స్‌ ఇండియా సంస్థ నిర్మించనుంది. త్వరలోనే చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement