నాని హీరోగా త్రివిక్రమ్ సినిమా | Trivikram Srinivas to produce nani movie | Sakshi
Sakshi News home page

నాని హీరోగా త్రివిక్రమ్ సినిమా

Mar 11 2017 12:09 PM | Updated on Sep 5 2017 5:49 AM

నాని హీరోగా త్రివిక్రమ్ సినిమా

నాని హీరోగా త్రివిక్రమ్ సినిమా

డబుల్ హ్యాట్రిక్ సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో నాని. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ మంచి

డబుల్ హ్యాట్రిక్ సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న టాలీవుడ్  యంగ్ హీరో నాని. విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ మంచి విజయాలు సాధిస్తున్న ఈ యంగ్ హీరో ఓ స్టార్ డైరెక్టర్తో కలిసి పని చేయబోతున్నాడు. ఇప్పటికే రాజమౌళి, గౌతమ్ మీనన్ లాంటి టాప్ డైరెక్టర్స్తో కలిసి పనిచేసిన నాని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈసినిమాను త్రివిక్రమ్ నిర్మాతగానే వ్యవహరించనున్నాడు.

ఇటీవల పవన్ కళ్యాణ్తో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించిన త్రివిక్రమ్ ఇప్పటికే నితిన్ హీరోగా సినిమాను ప్రారంభించాడు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందు నాని హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శివా నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమాలో నటిస్తున్నాడు నాని. ఆ తరువాత కూడా మరో రెండు మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. మరి వీటిని పక్కన పెట్టి అవసరాల సినిమాను స్టార్ట్ చేస్తాడా..? లేక అవన్నీ పూర్తి చేసే కొత్త సినిమా ప్రారంభిస్తాడా..? తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరుకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement